What is Smart Replay System First Time in ICC Event: క్రికెట్ అభిమానుల భారీ అంచనాల మధ్య మహిళల టీ 20 ప్రపంచకప్(Womens T20 World Cup 2024) ఆరంభమైంది. ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. ఈ వరల్డ్ కప్ లో తొలిసారిగా స్మార్ట్ రీప్లే సిస్టమ్(Smart Replay System) ను ప్రవేశపెట్టనున్నారు. అంపైర్లు తీసుకునే నిర్ణయాల్లో మరింత కచ్చితత్వం కోసం స్మార్ట్ రీప్లే సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే డీఆర్ ఎస్ అమల్లో ఉండగా ఇప్పుడు ఈ స్మార్ట్ రిప్లే సిస్టమ్ కూడా అందుబాటులోకి రానుంది.
ఏమిటీ స్మార్ట్ రీప్లే సిస్టమ్?
ఈ స్మార్ట్ రీప్లే సిస్టమ్ ను ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) లో.. ఇంగ్లాండ్(ENG)లో నిర్వహించిన ది హండ్రెడ్ వంటి టోర్నమెంట్‌లలో ఉపయోగించారు. అయితే ఈ టెక్నాలజీని ప్రధాన ICC ఈవెంట్‌లో ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. మహిళల టీ 20 ప్రపంచకప్ లో ప్రతీ మ్యాచును కనీసం 28 కెమెరాలతో రికార్డు చేస్తారు. వివిధ రకాల విశ్లేషణాత్మకాలకు ఈ కెమెరాలను వినియోగిస్తారు. హాక్-ఐ స్మార్ట్ రీప్లే సిస్టమ్‌తో టీవీ అంపైర్ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మల్టీ-యాంగిల్ ఫుటేజీని తక్షణమే సమీక్షించడానికి స్మార్ట్ రీప్లే సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇద్దరు హాక్-ఐ ఆపరేటర్లు టీవీ అంపైర్ ఉన్న ఒకే గదిలో కూర్చుని మ్యాచును వీక్షిస్తారు. స్మార్ట్ రీప్లే సిస్టమ్‌లో భాగంగా ఫీల్డ్ అంతటా ఉన్న హాక్-ఐ 28 హై-స్పీడ్ కెమెరాల ద్వారా పొందిన ఫుటేజీని పరిశీలిస్తారు. గతంలో స్మార్ట్ రీప్లే సిస్టమ్ చూపించిన దానికంటే - స్ప్లిట్-స్క్రీన్ చిత్రాలతో సహా మరిన్ని విజువల్స్‌కు ఇప్పుడు యాక్సెస్ ఉంటుంది.
డీఆర్ ఎస్ ద్వారా వచ్చే నిర్ణయాల వేగాన్ని పెంచడానికి ఈ స్మార్ట్ రీప్లే సిస్టమ్ ఉపయోగపడుతుంది. హాక్-ఐ ఆపరేటర్‌లు, థర్డ్ అంపైర్‌ల మధ్య టీవీ ప్రసార డైరెక్టర్ మధ్యవర్తిగా ఉంటారు. కానీ ఇప్పుడు స్మార్ట్ రీప్లే సిస్టమ్‌తో, ఆపరేటర్‌లు థర్డ్ అంపైర్ ఉన్న గదిలోనే ఉంటారు. ఇద్దరి మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఇది నిర్ణయాన్ని తనిఖీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అంపైర్ బ్యాట్, బాల్ మధ్య స్పష్టమైన అంతరాన్ని చూస్తే వారు అల్ట్రా-ఎడ్జ్‌ని తనిఖీ చేయరు. వెంటనే ఔటా కాదా అనే విషయాన్ని ప్రకటిస్తారు. గతంలో అయితే బాల్, బ్యాట్ మధ్య అంతరాన్ని గమనించినా అల్ట్రా ఎడ్జ్ చూసేవారు. కానీ ఇక అలా తనిఖీ చేయరు.
మహిళల టీ20 ప్రపంచకప్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న మహిళల T20 ప్రపంచ కప్ తొమ్మిదో ఎడిషన్ ప్రారంభమైంది. 2016 ఛాంపియన్స్ వెస్టిండీస్.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. భారత్ శుక్రవారం దుబాయ్‌లో రాత్రి 7.30 గంటలకు న్యూజిలాండ్‌తో తలపడుతుంది. గత మూడు టోర్నీల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగుతుంది.
Read Also: మహిళల టీ 20 ప్రపంచకప్, తప్పక తెలుసుకోవాల్సిన 10 విషయాలు
Read Also: మహిళల టీ 20 ప్రపంచకప్, తప్పక తెలుసుకోవాల్సిన 10 విషయాలు