Apple Diwali Sale: నేటి నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దీంతో పండుగల సీజన్ కూడా మొదలైంది. మరికొద్ది రోజుల్లో దసరా, ఆపై దీపావళి రాబోతోంది. అటువంటి పరిస్థితిలో చాలా కంపెనీలు తమ వినియోగదారులకు దీపావళి ఆఫర్లను అందిస్తున్నాయి. యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్‌ను గత నెలలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిందన్న సంగతి మనకు తెలిసిందే.


ఈ సిరీస్‌లో యాపిల్ మొత్తంగా నాలుగు ఫోన్‌లను విడుదల చేసింది. అవే ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్. ఇప్పుడు కంపెనీ ప్రజల కోసం దీపావళి సేల్‌ను మళ్లీ తీసుకొచ్చింది. దీనిలో మీరు కేవలం రూ. 7 వేల కంటే తక్కువ మొత్తం చెల్లించి ఐఫోన్ 16ను కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి ఆఫర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


యాపిల్ దీపావళి సేల్ వివరాలు ఇవే...
యాపిల్ తన అధికారిక వెబ్‌సైట్లో పేర్కొన్న దాని ప్రకారం... మీరు నెలకు కేవలం రూ.6,242 చెల్లించి సేల్‌లో ఐఫోన్‌ని 16ని కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండాత మీరు నెలకు కేవలం రూ.7,075 చెల్లించి ఐఫోన్ 16 ప్లస్‌ని కూడా కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు మీరు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కూడా పొందుతారు. అలాగే మీరు అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే మీకు ఏకంగా రూ. 10,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


ఐఫోన్ 16 ప్రోపై కూడా సూపర్ ఆఫర్లు
ఈ దీపావళి సేల్‌లో కంపెనీ తన అనేక మోడల్స్‌పై ప్రజలకు భారీ ఆఫర్ అందిస్తోంది. ఈ సేల్‌లో మీరు ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 మ్యాక్స్‌పై రూ. 5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇది కాకుండా వినియోగదారులు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌పై రూ. 3,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, ఐఫోన్ ఎస్ఈపై రూ. 2,000 క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్‌లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది.


ఫ్రీగా ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్...
యాపిల్ అధికారిక వెబ్‌సైట్లో తెలిపిన దాని ప్రకారం యాపిల్ దీపావళి సేల్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలుపై వినియోగదారులకు బీట్స్ సోలో బడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ మాత్రం అక్టోబర్ 4వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే యాపిల్ మ్యూజిక్ మూడు నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఐఫోన్‌తో అందుబాటులో ఉంటుంది.



Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే