Seethe Ramudi Katnam Serial Today Episode రేవతి రేపు తన పెళ్లి అందరూ దగ్గరుండి జరిపించాలని అన్నలు వదినలకు కోరితే మహాలక్ష్మీ రేవతిని తిడుతుంది. సీత చేసే పనులకు మేం చిరాకులో ఉంటే నువ్వు పెళ్లి అని మమల్ని పెళ్లి అని సతాయిస్తున్నావ్ అని అంటుంది. మీ అత్తా కోడళ్ల సమస్యకు నా పెళ్లికి సంబంధం ఏంటని అడుగుతుంది. 


అర్చన: సీత చేసే తల నొప్పి పనుల్లో నీ పెళ్లి ఒకటి. 
మహాలక్ష్మీ: నీ పెళ్లినే మాకు ఇష్టం లేదు పైగా నీకు ఆ సీత సపోర్ట్. 
రేవతి: నాకు మీ సపోర్ట్ కూడా కావాలి వదిన
జనార్థన్: మహా పెళ్లే వద్దు అంటే మళ్లీ మళ్లీ సపోర్ట్ అని చంపుతావేంటి. 
మహాలక్ష్మీ: మమల్ని కాదు అని నువ్వు కిరణ్‌ని పెళ్లి చేసుకుంటే నీతో మాకు ఆ క్షణంలోనే సంబంధం తెగిపోతుంది.
జనార్థన్: మేం ఆపెళ్లి కూడా రామ్.
గిరిధర్: పెళ్లికి రావకపోవడమే కాదు నీ పెళ్లి ఎలా అవుతుందో మేం చూస్తాం.


రాత్రి రేవతి అన్నా వదినల మాటలు తలచుకొని ఏడుస్తుంది. సీత, రామ్ అక్కడికి రావడంతో విషయం చెప్తుంది. ఇంతలో విద్యాదేవి కూడా వస్తుంది. ఎలా అయినా పెళ్లి జరిపిస్తాం అని రామ్ అంటాడు. విద్యాదేవి కూడా ఏలా అయినా పెళ్లి అవుతుంది ధైర్యంగా ఉండమని  అంటుంది. ఎవరు ఆపాలి అనుకున్నా మీ పెళ్లి ఆగదని సీత చెప్తుంది. ఇంతలో కిరణ్‌ కూడా అక్కడికి వస్తాడు. అర్చన మేడ మీద నుంచి మొత్తం చూస్తుంది. అందరూ ఏదో గూడుపుటానీ చేస్తున్నారని విషయం మహాలక్ష్మీకి చెప్పాలని అంటుంది. అర్చన గరిధర్, మహాలక్ష్మీ, జనాని తీసుకొని వస్తుంది. రిజిస్టర్ మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నారని అనుకుంటారు. దానికి మహాలక్ష్మీ వాళ్లు ఏ పెళ్లి ఏ విధంగా చేసుకున్నా ఆపుదామని అంటారు. ఇక కిరణ్‌ని రేవతికి సరదాగా బయటకు తీసుకెళ్లమని చెప్తారు దాంతో కిరణ్ రేవతిని తీసుకెళ్తాడు. మరోవైపు జనార్థన్ పరిస్థతి మన చేయి జారకముందే రేవతిని  ఆపాలని అంటాడు. అంతా నేను చూసుకుంటానని మహాలక్ష్మీ అంటుంది.


ఉదయం సీత రేవతి కోసం కాఫీ తీసుకొస్తుంది. కానీ రేవతి కనిపించదు. సీత, రామ్‌లు ఇళ్లంతా వెతుకుతారు. విద్యాదేవికి కూడా చెప్తారు. దాంతో విద్యాదేవి రాత్రి రేవతి ఇంటికి వచ్చిందా అని అడిగితే రామ్ కిరణ్‌కి కాల్ చేస్తాడు. కిరణ్‌ రాత్రి డ్రాప్ చేశా అని చెప్తాడు. రామ్ వాళ్లు షాక్ అవుతారు. ఏమైందని కిరణ్ అడిగితే రేవతి కనిపించడం లేదని అంటారు. కిరణ్‌ భయపడతాడు. దాంతో సీత రేపే పెళ్లి కాబట్టి గుడికో పెళ్లి పనికో వెళ్లుంటుందని అంటుంది. విద్యాదేవి టీచర్ గుడిలో పక్కింటిలో వెతకడానికి వెళ్తారు. మరోవైపు పెళ్లి రేపే కదా రేవతిని ఒకసారి అడుగుదామని మహాలక్ష్మీ అంటుంది. ఇంతలో సీత, రామ్‌లు అటు వస్తారు.


ముందు సీత, రామ్‌లకు విషయం చెప్పాలని అనుకుంటారు. గిరిధర్, మహాలక్ష్మీలు రేవతి, రామ్ ఇద్దరూ మా మాట వినడం లేదని అందుకు సీతే కారణం అని అంటారు. ఇక సీత ఏది ఏమైనా రేపు రేవతి పెళ్లి జరిపిస్తామని అంటుంది. దాంతో మహాలక్ష్మీ మీరు చేయాల్సింది మీరు చేయండి మేం చేయాల్సింది మేం చేస్తాం అంటుంది. ఇక మహాలక్ష్మీ రేవతిని పిలవమంటే కనిపించడం లేదని రామ్ అంటాడు. దాంతో మహాలక్ష్మీ కావాలనే పారిపోయిందని అంటుంది. ఇదంతా నువ్వు సీత కిరణ్‌ కలిసి చేసిన పని అని అంటారు. రాత్రి మీరు కిరణ్‌తో రేవతిని పంపడం మేం చూశాం అని మహాలక్ష్మీ అంటుంది. రేవతిని అర్హత లేని కిరణ్‌కి ఇచ్చి పెళ్లి చేసి రేవతి జీవితం నాశనం చేస్తున్నారని అంటారు. రేవతి ఏమైంది అని మహాలక్ష్మీ సీతని అడుగుతుంది. కిరణ్‌ ఇదంతా చేసుంటాడని గిరిధర్ అంటాడు.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: డీఎన్ఏ టెస్ట్‌ కోసం లక్ష్మీ, జున్నులను తీసుకెళ్లిన మనీషా, చూస్తూ ఉండిపోయిన మిత్ర!