Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం తల్లిదండ్రులతో విహారి మాట్లాడుతాడు. తమ అల్లుడు చాలా గొప్పోడని కూతురిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంన్నాడని పొంగిపోతారు. మరోవైపు విహారి ఎన్ని రోజులు ఇలా అబద్ధాలు చెప్తూ వాళ్లని మభ్యపెట్టాలని కోపంతో చేతిని కబోర్డ్స్‌కి కొట్టుకుంటాడు. విహారి చేతికి రక్తం వస్తుంది.
విహారి: నా క్యారెక్టర్ మీదే నాకే అసహ్యం పుడుతుంది. కనక మహాలక్ష్మీ నువ్వు నాకు కనిపించనంత కాలం ఈ బాధ నాలో నన్నే తొలిచేస్తుంది. నా కోపం నన్నే ఓ రాక్షసుడిలా మార్చేస్తుంది. అసలెక్కడున్నావ్ కనకమహాలక్ష్మీ. అమ్మానాన్నల తప్ప మరో ప్రపంచం తెలియని ఓ అమ్మాయి. బయట లోకం తెలీని ఓ అమాయకురాలు అలాంటిది ఇంత పెద్ద సిటీలో ఎక్కడుందో ఎలా ఉందో అసలు ఎలా బతుకుతుందో.
ఉదయం విహారి ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభమవుతాయి. కనకం గుమ్మం ముందు పూల దండలు కడుతుంది. ఇంటి లోపల అంబిక, వసుధ, సహస్రలు బట్టలు నగలు చూస్తుంటారు. ఇక చారుకేశవ అక్కడికి వస్తే అంబిక ఇన్ డైరెక్ట్‌గ్ గా దొంగ అని బావకి మాత్రమే అర్థమయ్యేలా సెటైర్లు వేస్తుంది. మరోవైపు విహారి జాగింగ్ చేసుకుంటూ ఇంటికి వస్తుంటాడు. కనకం పూల దండ కట్టలేక ఇబ్బంది పడుతూ కాళ్లు అందక పడిపోబోగే అప్పుడే వచ్చిన విహారి వెనక నుంచి చూసి కనకం పడిపోకుండా కనకం వీపు మీద రెండు చేతులు ఆనించి పట్టుకోకుండా పడతాడు. దాంతో కనకం చేతిలోని బంతి పూల దండ కనకం మెడలో నుంచి విహారి మెడలోకి పడుతుంది. పై నుంచి ఇద్దరి మీద పూలు పడతాయి. అంబిక ఏదో ప్లాన్‌తో ఇద్దరినీ ఫోటో తీస్తుంది.
విహారి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. లక్ష్మీ చూడలేదని చెప్తుంది. ఇక విహారి చూడకుండా లక్ష్మీ ముఖం వెనక్కి తిప్పుదు. విహారి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతాడు. సహస్ర వాళ్లు ఏం అపార్థం చేసుకుంటారో అని లక్ష్మీ అనుకుంటుంది. ఇక ట్యాబ్లెట్స్ పట్టుకొని యమున దగ్గరకు వెళ్తుంది. యమునని బెడ్ మీద కూర్చొబెట్టి మందులు ఇస్తుంది. ఈ ఇంట్లో ఎవరూ తనని పట్టించుకోకపోయిన నువ్వు ఉన్నావ్ కదా లక్ష్మీ అని అంటుంది యమున.
లక్ష్మీ: ఈ రోజు నేను మీకు తోడు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు కానీ ఎప్పటికీ మీకు తోడు ఉండేది మీరే కదామ్మా ఇలాంటి విషయాలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇంతకీ ఏదో వెతుకుతున్నారు నాకు చెప్పండి నేను వెతుకుతాను.
యమున: రేపు విహారి నిశ్చితార్థం కదా వాళ్ల నాన్న డ్రస్ విహారికి ఇద్దామని వెతుకుతున్నా.
లక్ష్మీ: అంతే కదా నేను వెతుకుతా అని లక్ష్మీ డ్రస్ తీసి యమున చేతిలో పెడుతుంది. యమున దాన్ని పట్టుకొని గుండెలు హత్తుకొని ఏడుస్తుంది. లక్ష్మీ కూడా ఏడుస్తుంది.
యమున: ఆయన డ్రస్ అమ్మా ఇది. ఇది చూసినప్పుడల్లా ఆయన నాతోనే ఉన్నారనిపిస్తుంది. ఆయన చేతులతో నన్ను దగ్గరకు తీసుకున్న భావన కలుగుతుంది. ఇది విహారికి రేపు వేసుకోమని చెప్పి ఇవ్వాలి.
పద్మాక్షి బుక్ చదువుతుంటే అంబిక తాను తీసిన ఫొటో పద్మాక్షికి చూపిస్తుంది. సహస్ర కూడా అక్కడికి వస్తుంది. అసలేం జరుగుతుంది ఏంటీ ఈ చెండాలం అని పద్మాక్షి అడుగుతుంది. సహస్ర కూడా చిరాకు పడుతుంది. ఇలాంటి వాళ్లని ఎందుకు ఇంట్లో ఉంచుతున్నారని అంటుంది. పద్మక్షి కోపంతో యమున గదిలో ఉన్న లక్ష్మీ దగ్గరకు వస్తుంది. ఇక డ్రస్ చూస్తున్న లక్ష్మీ బాగుందని కొంచెం కుట్లు ఊడిందని తాను వేసి ఇస్తానని చెప్పి తీసుకెళ్లబోతుంది. ఇంతలో అక్కడికి పద్మాక్షి వచ్చి లక్ష్మీ అని అరుస్తుంది. ఏమైందని లక్ష్మీ అడుగుతుంది. ఈ ఇంట్లో వలపులు బాగా వలికిస్తున్నావ్ అని అంటుంది. విహారి, లక్ష్మీల ఫొటో యమున, లక్ష్మీలకు చూపిస్తుంది.
యమున: మనసులో ఆ ఫొటోలో అంత తప్పేముంది లక్ష్మీ పడిపోబోతే విహారి పట్టుకున్నాడు. దీనికెందుకు వీళ్లు ఇంత రాద్దాంతం చేస్తున్నారు.
లక్ష్మీ: అమ్మగారు అది నేను పడిపోబోతే
సహస్ర: ఏయ్ ఆపు నీ దొంగ నాటకాలు విహారి వచ్చినప్పుడే నువ్వు పడిపోయావ్ అప్పుడు నీకు విహారి పట్టుకున్నాడంట కట్టుకథలు ఎంత అందంగా అల్లుతుందో చూడండి.
లక్ష్మీ: నిజంగా జరిగింది అదే అమ్మ
అంబిక: చాలు ఆపు. విహారి పట్టుకోవాలనే అలా చేశావ్.
లక్ష్మీ: నాకు అలాంటి ఉద్దేశం లేదండి మా తల్లిదండ్రులు నన్ను అలా పెంచలేదు.
పద్మాక్షి: నోర్ముయ్ అసలు ఎవర్తివే నువ్వు ఇన్నాళ్లు నా పుట్టింటికి వచ్చి నా కూతురిని కోడలిని చేయాలనుకుంటున్నా మధ్యలో ఇలాంటి చిచ్చులు పెట్టాలని చూస్తే ఊరుకోను. అసలే ఈ ఇంట్లో కొందరు పనికి రాని వస్తువుల్లా పడున్నారు. వాళ్లే మాకు బరువు అనుకుంటే వాళ్లకి తోడు నువ్వు కూడా మరో దరిద్రంలా వచ్చావ్. నీ వల్ల ఈ ఇంట్లో ఎలాంటి కలతలు రేగినా నిన్ను నిలువునా చీరేస్తా.
పద్మాక్షి మాటలకు లక్ష్మీ ఏడుస్తుంది. యమున క్షమాపణ చెప్తుంది దాంతో లక్ష్మీ పద్మాక్షి బాధలో అన్నారు కానీ ఉద్దేశ పూర్వకంగా అనలేదని లక్ష్మీ వెనకేస్తుంది. వాళ్ల మాటలు మర్చిపోమని యమునతో చెప్తుంది. నీ బాధని దిగమింగడంతో పాటు నాకు కూడా ధైర్యం చెప్తున్నావ్ అని యమున అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.