Satyabhama Serial Today Episode క్రిష్ తెలుగు మాస్టార్‌ దగ్గరకు వచ్చి తిప్పలు పడతాడు. ఆయన చెప్పిన పద్యం చెప్పలేక ఏడుస్తాడు. క్రిష్ కాళ్లావేళ్ల పట్టి బతిమాలడంతో తెలుగు మాస్టార్ తన వయసు 56 ఏళ్లని చెప్తాడు. మరోవైపు హర్ష ఇంటికి పెళ్లి వాళ్లు వస్తారు. విశ్వనాథం కుటుంబం మొత్తం మర్యాదలు చేస్తారు. పెళ్లి వాళ్లు ప్రతీ విషయానికి వర్జ్యం, దుర్ముహూర్తం అని పట్టింపులు ఎక్కువ చేస్తారు. వాళ్లని చూసి చాలా చాదస్తం అని హర్ష అనుకుంటారు.


నందిని మైత్రిని తీసుకొస్తుంది. మైత్రిని కూర్చొపెట్టడానికి రెడీ అవగానే పెళ్లివాళ్లు ఇలా కూర్చో అలా కూర్చో అని అంటాడు. ఇక మైత్రి జాతకం గురించి అడిగి చనిపోయిన తన తల్లిదండ్రులను తక్కువ చేసి మాట్లాడుతారు. దానికి మైత్రి జాతకాలు చాదస్తం అని మాట్లాడుతుంది. వాళ్ల ప్రవర్తనకు హర్ష వాళ్ల మీద ఫైర్ అవుతాడు. దాంతో పెళ్లి వాళ్లకి హర్షకి గొడవ జరుగుతుంది. దాంతో హర్ష వాళ్లని వెళ్లిపోమని అంటాడు. పెళ్లి  వాళ్లు వెళ్లిపోతారు. నందిని ఎక్కువ డిసప్పాయింట్ అయిపోతుంది. మరోవైపు మహదేవయ్య ఇంటికి చక్రవర్తి  వస్తాడు.


మహదేవయ్య: ఎందుకు వచ్చావ్ రా.
చక్రవర్తి: రావాలి అనిపించింది.
మహదేవయ్య: అలా అనిపించకూడదు.
చక్రవర్తి: అది నా చేతుల్లో లేదు. అయినా ఎందుకు అంత భయపడుతున్నావ్. నీ ముఖం చూస్తే తెలుస్తుంది.
మహదేవయ్య: నువ్వు ఏదో ప్లాన్ చేసుకొనే వచ్చావ్ నీ ఆటలు నా ముందు నడవవు. ఇదిగో ఇదే నీకు చివరి వార్నింగ్ అని చెప్పబోతే సత్య వస్తుంది. జయమ్మ కూడా వచ్చి ఎమోషనల్ అవుతుంది.
సత్య: అంకుల్ తనంతనట తాను రాలేదు అమ్మమ్మ. నేను పిలిస్తే వచ్చారు. మహదేవయ్య, రుద్ర షాక్ అవుతారు. 
మహదేవయ్య: సత్య పిలుచుడేంటి అసలేం జరుగుతుంది. 
భైరవి: పిలిచే ముందు మాకు కూడా చెప్తే మంచిగా ఉంటుంది. సంతోష పడేవాళ్లం కదా..
జయమ్మ: ఇప్పుడు కూడా ఏమైంది సంతోషపడుదాం. నీ వల్ల దూరమైన సంబంధాలు దగ్గరవుతున్నాయి. నీ విలువ తెలుస్తుందమ్మా. 
మహదేవయ్య: ఇంతకు తమ్ముడికి ఎందుకు పిలిచివా చెప్పలేదు.
సత్య: మా పెళ్లి అయినప్పటి నుంచి అంకుల్ రాలేదు మాకు రిసార్ట్‌లో చాలా మంచిగా చూసుకున్నారు అందుకే పిలవాలి అనిపించింది. 
జయమ్మ: ఒకటి మాత్రం నిరూపణ అయిందమ్మా వీడికి నా కంటే నువ్వే ఎక్కువ అని నిన్ను చూస్తే అసూయగా ఉంది.
క్రిష్: హాయ్ బాబా ఎప్పుడు వచ్చావ్. ఏంటి విశేషాలు.
మహదేవయ్య: మొన్ననే కదా కలిశారు
చక్రవర్తి: నాకు అయితే చాలా రోజులు అయినట్లు ఉంది.
క్రిష్: నాకు కూడా సేమ్ టూ సేమ్. ఏంటి బామ్మ బాబాయ్ వైపు అలా చూస్తున్నావ్.
జయమ్మ: వాడు రావడమే తక్కువ వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడు. అందుకే వచ్చినప్పుడు కళ్లారా చూసుకుందామని.
చక్రవర్తి: మనసులో నువ్వే అలా అంటే నా పరిస్థితి ఏంటమ్మా కనీసం నా కొడుకుతో నాన్న అని కూడా పిలిపించుకోలేకపోతున్నా.
మహదేవయ్య: మనసులో సత్య చూపునకు అర్థమేంటి క్రిష్‌ గాడు చక్రవర్తి కొడుకు అని సత్యకి తెలిసిపోయిందా.


మరోవైపు మైత్రి బయట ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి హర్ష వెళ్లి ఓదార్చుతాడు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న దురదృష్టవంతురాలిని అని దిక్కులేనిదానిలా మీ ఇంట్లో ఉన్నానని ఇక్కడ కూడా నా వల్లే సమస్యలని ఏడుస్తుంది. తనకు మంచి చేయాలి అనుకున్న వారంతా తన వల్లే ఇబ్బంది పడుతున్నారని తనకు దూరం అవుతున్నారని ఏడుస్తూ తనని ఇంటి నుంచి తరిమేయమని అంటుంది. హర్ష మైత్రిని పట్టుకొని అలా మాట్లాడొద్దని అంటాడు. తనకు ఇక సంబంధాలు చూడొద్దని ఇలా ఒంటరిగా మిగిలిపోతానని మైత్రి ఏడుస్తూ హర్షని వాటేసుకుంటుంది. హర్ష కూడా నీ బాధ్యత నాది అని ఓదార్చుతాడు. సీన్ కట్ చేస్తే సత్య అందరికీ భోజనం వడ్డిస్తుంది. జయమ్మ ప్రేమగా చక్రవర్తికి ఓ ముద్దు పెడుతుంది. 


సత్య: అంకుల్ మీకు ఇక్కడ ఇంత మంది మీ వాళ్లు ఉన్నారు మీరు ఎందుకు అందరికీ దూరంగా ఉంటారు ఎందుకు ఇక్కడికి రారు.
భైరవి: ప్రశాంతంగా తిననివ్వవానే ఇప్పుడు ఈ సోది అవసరమా.
చక్రవర్తి: అదేం లేదమ్మా నాకు గొడవలు ఇష్టం ఉండవు అందుకే దూరంగా ఉంటున్నా. 
సత్య: క్రిష్‌ పుట్టినప్పుడు మీరు ఇక్కడ లేరా.
జయమ్మ: ఎందుకు లేడు కాకపోతే క్రిష్‌ పుట్టినప్పుడే వీడికి కూడా బాబు పుట్టాడు అందుకే హాస్పిటల్‌లో ఉన్నాడు. 
సత్య: ఒకేసారి డెలివరీ అయిందా మరి బామ్మ నాకు చెప్పలేదు ఆ విషయం. 
క్రిష్: బాబాయ్‌ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా ఫారెన్‌లో ఉన్నాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: రాకేష్‌కు నిజం చెప్పిన రవి – వినయ్‌ బండారం బయటపెడతామన్న శంకర్‌