Brahmamudi Serial Today Episode:  కావ్య దగ్గరకు వచ్చిన స్వప్న ఒక్కసారి రాజ్‌కు సారీ చెప్పమని చెప్తుంది. ఇప్పటికీ ఆయనకు నేను లక్షల సార్లు సారీ చెప్పానని.. ఆయనకు కూడా నా మీద ఉంటే ఆయనను నాకు ఒక్కసారి సారీ చెప్పమను.. నేను వెళ్లి చెప్తాను. చెప్పడమే కాదు అత్తయ్యగారి దగ్గరకు  వెళ్లి క్షమాపణ చెప్పి ఆమె  కాళ్లు పట్టుకుంటాను అంటుంది. ఇదంతా అయ్యేది కాదు అనుకుని స్వప్న వెళ్లిపోతుంది. ఇంతలో ఎక్స్‌ ఫో నిర్వాహులు  వచ్చి సామంత్‌ గ్రూప్‌ జువ్వెల్లరీకి అవార్డు వచ్చిందని ప్రకటించడంతో అందరూ షాక్‌ అవుతారు. సామంత్‌, అనామిక హ్యాపీగా ఫీలవుతారు.


సామంత్‌: నేను నెంబర్‌ వన్‌ పొజిషన్‌కు రావడానికి చాలా టైం పట్టింది. ఈ ప్రదర్శనలో మా సంస్థకు అవార్డు వస్తుందని నేను ఊహించలేదు. కానీ ఫైనల్‌ గా సాధించగలిగాను. అందరూ అంటూ ఉంటారు. ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని కానీ ఈరోజు నేను సాధించిన ఈ విజయం వెనక నాకు ఇద్దరు  స్త్రీలు ఉన్నారు. మొదటి వ్యక్తి అనామిక. ఈ శుభసందర్భంలో మీకో గుడ్‌ న్యూస్ చెప్పబోతున్నాను. నేను అనామికను  పెళ్లి చేసుకోబోతున్నాను. అలాగే నా ఈ విజయానికి కారణమైన రెండో స్త్రీ మా క్రియేటివ్‌ డిజైనర్‌ మిసెస్‌ కావ్య.


 అని సామంత్ చెప్పగానే కావ్యతో పాటు అందరూ షాక్‌ అవుతారు. ఈ ఆవార్డు అందుకునే అర్హత మాకన్నా.. మా డిజైనర్‌ కావ్యకే ఉంది అని చెప్తాడు సామంత్‌.


కావ్య: సురేష్‌ గారు నేను డిజైన్స్‌ వేసింది వేరే కంపెనీకి కదా..?


సురేష్‌: ఆ కంపెనీ కూడా సామంత్‌ గ్రూప్‌ వాళ్ల బినామీనే అమ్మా మీకు తెలియదా?


సామంత్‌: మిస్సెస్‌ కావ్య ప్లీజ్‌ కమాన్‌ టూ డయాస్‌.


కావ్య: అదేంటి నన్ను పిలుస్తున్నారు. వాళ్ల ఏడుపు ఏదో వాళ్లు ఏడవమనండి. ఇందులో నన్నెందుకు లాగుతున్నారు. నేను తీసుకోను


అనామిక: కావ్య స్టేజీ మీదకు వచ్చి అవార్డు తీసుకో.. మిసెస్‌ కావ్య ఇది మీ అవార్డు మీరే తీసుకోవాలి. రండి


కావ్య: నన్నెందుకు ఇలా ఇరికిస్తున్నారు. నాకేంటి సంబంధం.


సురేష్‌: అమ్మా మీరు ముందు వెళ్లి అవార్డు తీసుకోండి తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. బాగోదు. అందరూ చూస్తున్నారు  అమ్మా..


కావ్య: సర్‌ నేను ఈ అవార్డు తీసుకోను మీరెందుకు ఇలా చేస్తున్నారు. నేను ఈ అవార్డు తీసుకుంటే ఒక వ్యక్తిత్వం లేని దాన్ని అయిపోతాను.


అనామిక: కమాన్‌ కావ్య ఫ్లీజ్‌ స్టేజీ మీదకు వచ్చేసెయ్‌.


 అని పిలవగానే కావ్య భయంతో మెల్లగా నడుచుకుంటూ స్టేజీ మీదకు వెళ్లి అనామికను ఇంత మోసమా..? నువ్వు కావాలనే మోసం చేశావా? అంటూ ప్రశ్నిస్తుంది. అదేమీ  పట్టించుకోకుండా అనామిక మా కంపెనీకి అవార్డు రావాలని కావ్య చాలా కష్టపడింది. ఈ అవార్డు మేము తీసుకోవడం కన్నా కావ్య తీసుకోవడమే సముచితం అంటుంది. దీంతో రాజ్‌ కోపంగా చూస్తుంటాడు. రుద్రాణి రాజ్‌ను రెచ్చగొడుతుంది. ఇద్దరూ మన ఇంట్లోంచి బయటకు వెళ్లగానే ఎలా రివేంజ్‌ తీర్చుకున్నారో చూడు అంటుంది.


   ఇంట్లో లైవ్‌ లో చూస్తున్నవాళ్లు షాక్‌ అవుతారు. ధాన్యలక్ష్మీ మాత్రం కావ్యను తిడుతుంది. ఆమె నిజస్వరూపం నాకు ముందే తెలుసు కాబట్టి నేనేం షాక్‌ కాలేదు అంటుంది. మరోవైపు కావ్య అవార్డు తీసుకుని వెళ్లిపోతుంటే మీడియా వాళ్లు వచ్చి మీరు దుగ్గిరాల ఇంటి కోడలు అయ్యుండి వారి కంపెనీకి వ్యతిరేకంగా పనిచేయడం ఏంటి? అంటూ ప్రశ్నలు అడుగుతుంటారు. ఏం చెప్పాలో అర్థం కాక కావ్య బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాజ్‌, సుభాష్‌, స్వప్న వెళ్లిపోతారు.


స్వప్న: ఇంకా ఇక్కడే ఉంటే గొడవ మరింత పెద్దది అవుతుందే.. వెళ్లిపోవే..


రాజ్‌: కంగ్రాచ్యులేషన్‌.. అద్బుతం నీకు మాటకు మాట జవాబు చెప్పడమే తెలుసు అనుకున్నాను. మాటంటే పడటం అలవాటు లేదనుకున్నాను.  కానీ నీలో చాలా కళలు ఉన్నాయని ఇవాళే అర్థం అయింది కళావతి. నీకు అనామికకు ఏమాత్రం తేడా లేదని నిరూపించావు.


కావ్య: మీరు చూసింది ఏదీ నిజం కాదు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు.


రాజ్‌: ఏది నిజం కాదు


 అంటూ రాజ్‌ నిలదీయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం