Horoscope Prediction: హిందూ పురాణాల ప్రకారం పుట్టిన ప్రతి మనిషికి జ్యోతిష్యశాష్ట్రం అనుసరించి జాతక విశ్లేషణ చేస్తారు. అయితే ఈ జాతక విశ్లేషణ అనేది ఆ వ్యక్తి జాతక చక్రంలోని రాశుల కదలికల ఆధారంగా చెప్తుంటారు. జ్యోతిష్యశాస్త్రంలో పన్నెండు రాశులు, 27 నక్షత్రాలు ఉంటాయి. అయితే జ్యోతిష్యశాస్త్రంలోని పన్నెండు రాశులలో మూడు రాశులకు మాత్రం ప్రత్యేక స్థానం ఉందంటున్నారు పండితులు. ఆ మూడు రాశులలో జన్మించిన వ్యక్తులకు అతీంద్ర శక్తులు ఉంటాయట. వారు స్వయంగా ఆత్మలను చూస్తారట. ఆత్మలతో మాట్లాడతారట. అయితే ఇంతకీ ఆ మూడు ఆత్మలు ఏవీ.. ఇంకా వాటికున్న ప్రత్యేకతలేంటి. అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్యశాష్ట్రంలోని పన్నెండు రాశుల ఆధారంగానే మనుషుల గుణగణాలను వారి భూత భవిష్యత్ వర్తమానాలను పండితుల అంచనా వేస్తుంటారు. మీరు సరిగ్గా గమనిస్తే మనలో కొంత మంది తరచుగా మౌనంగా ఉండిపోతుంటారు. లేదా ఆకాశం వైపు అలాగే చూస్తుంటారు. లేదా ఈ ప్రపంచంతో తమకు ఏమీ సంబందం లేనట్టుగా ఉండిపోతుంటారు. ఈ తరహా వ్యక్తులు కొన్ని ప్రత్యేకమైన వస్తువుల్ని తమ దగ్గర ఉంచుకుంటారు. అలాగే తాము అందరిలా లేమన్న విషయం తెలుసుకున్నా బయటపడరట. మరికొంత మంది ఆత్మలతో డైరెక్టుగా మాట్లాడుతుంటారు. ఇదే వియషంయ జ్యోతిష్య పండితులు కూడా చెప్తుంటారు. మిగతా వారు చూడలేని వాటిని వీళ్లు చూడగలరు అంటున్నారు. ఈ లక్షణాలకు కారణం. వారి బర్త్ చార్ట్‌లో ఎనిమిదవ, పన్నెండవ గ్రహాలకు సంబంధం ఉందంటున్నారు. అలాగే అందరికీ దష్టిని ఇచ్చే చంద్రగ్రహం, బుధ గ్రమం ఈ రాశుల వారికి మాత్రం బలాన్ని ఇస్తాయట.
ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!
మిథున రాశి: మిధున రాశికి అదిపతి బుధగ్రమం. దీన్ని సమాచార గ్రహంగా కూడా చెబుతారు. దీని సమాచారం పాతాళంలోని చీకటి నదుల వరకు విస్తరించి ఉంటుంది. మిధున రాశి వారు. అపరిచితులు, దెయ్యాలు గ్రహాంతర వాసుల నుంచి రహస్యాలను వినడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారట. వీరు చాలా తెలివైన వారు. నిద్రపోతున్నపుడు కూడా వీరు స్పష్టమైన కలలను కంటు ఉంటారట. వీరు ఇతరులు భయపడే నిగూఢ అంశాలపై కూడా మాట్లాడేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారట.
వృశ్చికరాశి: వృశ్చిక రాశిలో జన్మిచిన వ్యక్తలు ఎప్పుడూ శృంగారం, మరణం, రహస్యాలు, నిగూఢ క్రీడలు, సందేహాస్పదం, అవిశ్రాంత ఆత్మలు, పునర్జమ్మ వంటి అంశాలకు సంబంధించిన వాటిపై ఆసక్తి చూపుతారట. ఈ రాశి వారికి స్వచ్చమైన జలశక్తి ఉంటుందట. ఇది అంతర్ దృష్టిని కలిగిస్తుంది. వీరు ఎవరినైనా అనుమానిస్తే ఆ అనుమానం కరెక్టు అవుతుందట. వీరు లోకాన్ని ఈజీగా చదివేస్తారట. లోకం తీరు, పరిణామాలు వంటి వాటిని ఎంతో తేలిగ్గా చూడగలరట. వృశ్చిక రాశి వారు అతీంద్రీయ శక్తుల పట్ల బాగా ఆకర్షితులవుతారని.. వీరిని ఎవరూ అంత ఈజీగా మోసం చేయ్యలేరని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.
మీనరాశి: మీనరాశిలో పుట్టిన వ్యక్తులను వరుణ గ్రహం పాలిస్తూ ఉంటుందట. ఇది సంకేతాలు, దృశ్యాలు, భ్రమలు, మార్మిక అంశాలతో సంబంధం ఉండే గ్రహం. వీరు అపరిచితులు, తేలియాడు ఆత్మల శక్తులు, మానసిక శిథిలాలు వంటి అసాధారణమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారట. ఈ రాశివారు ఆత్మల్ని చూడగలరు. వాటితో మాట్లాడగలరు. అతీంద్రీయ అంశాల్లో వీరు జోక్యం చేసుకుంటారు. అయితే వీరు జీవితాన్ని ఒకేవైపు కాకుండా రెండు వైపులా చూడగలరట. ఓ వైపు అతీంద్రీయ అంశాల్ని పరిశీలిస్తూనే మరోవైపు సాధారణ ప్రపంచంలోనూ జీవించేలా ఈ రాశి వారు కచ్చితంగా సరిహద్దును విభజించుకోగలరని పండితులు సూచిస్తున్నారు.
NOTE: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంధాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక ఆంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు ఏబీపీ దేశం ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఏబీపీ దేశం, ఏబీపీ నెట్వర్క్ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.
ALSO READ: పొరపాటున కూడా చెత్త కుండీని ఇంట్లో ఈ దిక్కున పెట్టకండి. లేదంటే ధన నష్టం వాటిల్లుతుందట