Dustbin Vastu: ఈరోజుల్లో కొత్తగా ఇల్లు కట్టుకునే వారందరూ తప్పకుండా వాస్తు ప్రకారం కడుతుంటారు. ఒకవేళ అప్పటికే నిర్మించిన ఇంటిని కొనాలన్నా.. వాస్తు చూసుకునే కొంటుంటారు. అయితే ఇంటి విషయంలోనే కాకుండా ఇంట్లో అమర్చే వస్తువుల విషయంలో  కూడా వాస్తు పాటించాలంటున్నారు ఆ శాస్త్ర నిపుణులు.  ముఖ్యంగా ఇంట్లో డస్ట్‌బిన్‌ సరైన దిశలో ఉంచాలని లేకపోతే లేనిపోని ప్రతికూల ప్రభావాలు ఆ ఇంట్లో వారిపై పడతాయని సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం డస్ట్​బిన్‌ ను  ఏ దిక్కులో పెట్టాలి. ఏ దిక్కు లో పెట్టకూడాదు. ఏ దిశలో పెడితే అనుకూల ఫలితాలు పొందవచ్చే ఈ కథనంలో తెలుసుకుందాం.


తూర్పు: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డస్ట్‌ బిన్‌ ను తూర్పు దిశలో ఉంచకూడదట. తూర్పు దిశలో చెత్తబుట్ట ఉంటే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందట. ఇంట్లో వారికి ఎప్పుడూ కష్టాలు ఏరులై పారుతుంటాయట.


పడమర: వాస్తు శాస్త్రం ప్రకారం చెత్తబుట్టను పడమర దిశలో ఉంచితే ఆ ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీ పెరుగుతుందట. ఇక ఇంట్లో ఉండేవాళ్లకు సఖఃసంతోషాలు లేకుండా ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లమ్‌ వస్తుందట.


ఉత్తరం: చెత్తబుట్టను ఉత్తర దిక్కులో పెడితే వాస్తు శాస్త్రం ప్రకారం ఆ ఇంట్లో వాళ్ల ఉద్యోగం అవకాశాలపై ప్రభావం చూపుతుందట. అలాగే వ్యాపారంలోనూ ఒడిదుడుకులు ఎదురవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.


దక్షిణం: వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో డస్ట్‌ బిన్‌ పెడితే ఆ ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీ పెరిగి ఇట్లో వాళ్లకు మానసిక సమస్యలు తలెత్తుతాయట.


ఆగ్నేయం: వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయంలోనూ డస్ట్‌ బిన్‌ ఉండకూడదట. దీనివల్ల ఆ ఇంట్లో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు.


నైరుతి: చెత్తబుట్ట పెట్టేందుకు ఉత్తమమైన దిశగా నైరుతి దిశను సూచిస్తుంది వాస్తు శాస్త్రం.  నైరుతిలో డస్ట్ బిన్‌ పెడితే  ఆ ఇంట్లో పాజిటివటీ పెరుగుతుందట.  ఆ ఇంట్లో వాళ్లు హ్యాపీగా ఉంటారట.


వాయవ్యం: వాస్తుశాస్త్రం ప్రకారం డస్ట్ బిన్‌ పెట్టుకునేందుకు మరో అనువైన దిశగా వాయవ్యాన్ని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు. వాయవ్యంలో డస్ట్‌ బిన్‌ పెడితే ఆ ఇంట్లో వాళ్లకు చేసే పని మీద శ్రద్ద పెరుగుతుందట. ప్రతికూల ఆలోచనలు వారి మనసుల్లోకి రావట. ఆ ఇంట్లో సుఖసంతోషాలకు కొదువ ఉండదట.  


ఈశాన్యం: వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో డస్ట్​బిన్​ను ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉంచకూడదు. ఎందుకంటే ఈ దిశ దేవుని సన్నిధితో ముడిపడి ఉంటుందట. అలా ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు వాస్తు నిపుణులు.


 ఇంకా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి బాల్కనీలో కూడా చెత్తబుట్ట పెల్లడం కానీ చెత్త వేయడం కానీ చేయకూడదట. అలా చేస్తే లక్ష్మీ దేవికి కోపం వస్తుందట. ఎప్పుడు ఆ ఇంటి వాళ్లు ఆర్థిక సమస్యలతో సతమతమవుతారట. అలాగే వాస్తు ప్రకారం పాత చీపురును, దేవుడి పాత ఫోటోలు చెత్తబుట్టలో వేయకూడదట. ఇలా చేస్తే ఆ ఇంట్లో అశుభాలు జరుగుతాయని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం డస్ట్‌ బిన్‌ బయట ఉంచడం మంచిదట. కొందరు ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరే చెత్తబుట్ట పెడుతుంటారు అలా కూడా చేయకూడదని దాని వల్ల ఇంట్లోకి వచ్చే పాజిటివ్‌ ఎనర్జీ రాదట. అలాగే పూజ గదికి దగ్గర కానీ బెడ్‌ రూంలో కానీ డస్ట్‌ బిన్‌ ఉంచుకోవడం వల్ల నెగటివ్‌ ఎనర్జీ పెరుగుతుందట.  


ALSO READ: సాంబ్రాణి ధూపం ఉపయోగాలు తెలుసా? ఆ రోజు ధూపం వేస్తే మీకు లక్ష్మీకటాక్షమే