Jio Airtel OTT Plans: టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లలో కాలింగ్, మొబైల్ డేటాతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ఉచిత సభ్యత్వం, ఉచిత కాలర్ ట్యూన్ మొదలైనవి ఉన్నాయి. జియో, ఎయిర్‌టెల్ కూడా అటువంటి రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇందులో వినియోగదారులు కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్, కాలర్ ట్యూన్, ఉచిత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందుతున్నారు. ఓటీటీ సేవలను అందించే జియో, ఎయిర్‌టెల్ కంపెనీల రీఛార్జ్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


జియో రూ.448 ప్లాన్
28 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ విధంగా 28 రోజుల్లో మొత్తం 56 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. అర్హత ఉన్న వినియోగదారులు అన్‌లిమిటెడ్ 5జీ డేటాకు కూడా యాక్సెస్ పొందుతారు. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాలింగ్ కూడా ఉన్నాయి.


12 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ కూడా...
ఈ ప్లాన్‌తో కంపెనీ జియోటీవీ యాప్ ద్వారా Jio సినిమా ప్రీమియం, సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కంచా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపల్, ఫ్యాన్ కోడ్, హొయ్‌చొయ్ మొదలైన యాప్స్ ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు జియో క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్‌ను కూడా పొందగలరు.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?


ఎయిర్‌టెల్ రూ. 449 ప్లాన్
జియోకి పోటీగా ఎయిర్‌టెల్ కూడా రూ. 449 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 3 జీబీ డేటా అందిస్తారు. అంటే 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో మొత్తం 84 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. జియో లాగానే ఎయిర్‌టెల్ కూడా ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తోంది. ప్లాన్ ద్వారా లభించే ఇతర ప్రయోజనాల్లో రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఉన్నాయి.


22 ఓటీటీలకు యాక్సెస్ ఇస్తున్న ఎయిర్‌టెల్
కంపెనీ ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇందులో సోనీ లివ్, చౌపాల్, సన్ నెక్స్ట్‌తో సహా 22 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. ఇది కాకుండా హలోట్యూన్స్ కూడా ఈ ప్లాన్‌ ద్వారా ఒక నెలపాటు ఉచితంగా లభిస్తాయి.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!