iQoo Z5: ఐకూ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర రూ.22 వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో సబ్ బ్రాండ్ ఐకూ తన కొత్త 5జీ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే ఐకూ జెడ్5 5జీ.

Continues below advertisement

ఐకూ జెడ్5 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో 5జీ ఫీచర్‌ను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే లాంచ్ అయింది.

Continues below advertisement

ఐకూ జెడ్5 ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,899 యువాన్లుగా(సుమారు రూ.21,600) నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,099 యువాన్లుగానూ(సుమారు రూ.26,200), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లుగానూ(సుమారు రూ.26,200) ఉంది. బ్లూ ఆరిజిన్, డ్రీమ్‌స్పేస్, ట్విలైట్ మార్నింగ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. చైనాలో దీని సేల్ సెప్టెంబర్ 28వ తేదీ నుంచి జరగనుంది. మనదేశంలో ఈ ఫఓన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

Also Read: Realme GT Neo 2: రియల్‌మీ సూపర్ ఫోన్ వచ్చేసింది.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లు!

ఐకూ జెడ్5 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, హెచ్‌డీఆర్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, ట్రై బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ, యూఎస్‌బీ ఓటీజీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 44W ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీని మందం 0.85 సెంటీమీటర్లుగానూ, బరువు 193 గ్రాములుగానూ ఉంది.

Also Read: iTel A26: రూ.6 వేలలోపే కొత్త ఫోన్.. వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయవచ్చు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Banking Trojan Malware: ఆండ్రాయిడ్ ఫోన్‌లో బ్యాంకింగ్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఇలా అస్సలు చేయకండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Continues below advertisement