ఐటెల్ ఏ26 స్మార్ట్‌ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 1.4 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను అందించారు. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 10(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయడం, స్టేటస్‌లు చేయడం వంటి వాటికి ఉపయోగపడే సోషల్ టర్బో ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు.

Continues below advertisement


ఐటెల్ ఏ26 ధర
దీని ధరను మనదేశంలో రూ.5,999గా నిర్ణయించారు. డీప్ బ్లూ, గ్రేడేషన్ గ్రీన్, లైట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి ఒక సంవత్సరం వారంటీని కూడా అందించారు. ఫోన్ కొన్నాక వంద రోజుల వరకు వన్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్ కూడా అందించారు.


Also Read: Realme GT Neo 2: రియల్‌మీ సూపర్ ఫోన్ వచ్చేసింది.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లు!


ఐటెల్ ఏ26 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 10(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5.7 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. వాటర్ డ్రాప్ తరహా డిజైన్ ఈ డిస్‌ప్లేలో ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 19:9గా ఉంది. ఆక్టాకోర్ 1.4 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 5 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు మరో వీజీఏ సెన్సార్ కూడా ఇందులో ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 2 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 3020 ఎంఏహెచ్‌గా ఉంది. ఇందులో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందించారు. ఇందులో ఉన్న సోషల్ టర్బో ఫీచర్ ద్వారా వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయడం, స్టేటస్‌లు చేయడం వంటివి చేయవచ్చు. 4జీ విల్టే, 4జీ వోల్టే, 3జీ, 2జీ నెట్‌వర్క్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.99 సెంటీమీటర్లుగా ఉంది.


Also Read: Redmi Smart TV: రూ.16 వేలలోపే స్మార్ట్ టీవీ.. సూపర్ ఫీచర్లు, అదిరిపోయే డిస్‌ప్లే.. లాంచ్ చేసిన షియోమీ!


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్‌లో ఆ ఫోన్ లేనట్లే.. యాపిల్ సంచలన నిర్ణయం!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి