ఐఫోన్ ఎస్ఈ+ 5జీ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్, మేల్లో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త ఐఫోన్ డిజైన్ దీనికి సంబంధించిన ముందు వెర్షన్ తరహాలోనే ఉండనుందని తెలుస్తోంది. ఫోన్ డిస్‌ప్లే కూడా 4.7 అంగుళాలుగానే ఉండనుందని సమాచారం. ఇందులో తర్వాతి తరం సెల్యులార్ కనెక్టివిటీని అందించనున్నట్లు తెలుస్తోంది.


దీనికి సంబంధించిన డిస్‌ప్లే ప్యానెల్ ఉత్పత్తి కూడా ఈ నెలలోనే ప్రారంభం కానుందని టెక్సాస్‌కు చెందిన డిస్‌ప్లే మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ సీఈవో రాస్ యంగ్ తెలిపారు. ఫోన్ ఉత్పత్తి మార్చి నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన షిప్‌మెంట్లు ఏప్రిల్ లేదా మేల్లో ప్రారంభం కానున్నాయి.


ఈ వారం ప్రారంభంలో ఐఫోన్ ఎస్ఈ కొత్త మోడల్ పేరు బయటకు వచ్చింది. ఐఫోన్ ఎస్ఈ 3, ఐఫోన్ ఎస్ఈ (2022)లతో పాటు ఈ ఫోన్ కూడా వార్తల్లో ఉంది. ఇందులో యాపిల్ ఏ15 బయోనిక్ చిప్, 3 జీబీ ర్యామ్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మెరుగైన 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించనున్నారు.


ఇందులో 5జీ కనెక్టివిటీని అందించనున్నారని తెలుస్తోంది. గతంలో వచ్చిన ఐఫోన్ ఎస్ఈ (2020)లో 4జీ సపోర్ట్ మాత్రమే ఉంది. ఐఫోన్ ఎస్ఈ+ 5జీతో పాటు కొత్త ఐప్యాడ్ ఎయిర్ మోడల్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇందులో ఏ15 బయోనిక్ చిప్‌ను అందించనున్నట్లు సమాచారం.


కొత్త ఐఫోన్ ఎస్ఈకి సంబంధించిన వివరాలను యాపిల్ అందించలేదు. ప్రస్తుతం ప్రపంచంలో నాన్ ప్రీమియం ఆండ్రాయిడ్ యూజర్లు 100 కోట్ల వరకు ఉన్నారని అంచనా. వీరిని ఆకట్టుకోవడానికి యాపిల్ బడ్జెట్ ఐఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.


Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!


Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!


Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!


Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!


Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి