ఎయిర్‌పోర్టుల్లో రద్దీని తగ్గించడం సహా పలు భద్రతా కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణికుల లగేజ్‌కు సంబంధించి ఇకపై ఒకరు ఒక హ్యాండ్ బ్యాంగ్‌ను మాత్రమే తీసుకువెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను జనవరి 21న సీఐఎస్ఎఫ్ ఐజీ విజయ్ ప్రకాశ్.. డీజీసీఏ సెక్యురిటీ విభాగానికి జారీ చేసారు.
అన్నిటికీ వర్తిస్తాయా?
ఈ ఉత్తర్వులను విమానయాన సంస్థలు కచ్చితంగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. ప్రయాణికులకు ముందుగానే సంబంధిత సమాచారాన్ని ఇవ్వాలని సూచించింది. లేకపోతే ఆ బాధ్యతను సదరు సంస్థ తీసుకోవాల్సి ఉంటుంది స్పష్టం చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అన్నీ దేశీయ విమాన సంస్థలు పాటించాల్సిందే.
ఇవి తప్పనిసరి..
- ఇక దేశీయ విమానాల్లో వెళ్లే ప్రయాణికులు ఇక ఒక హ్యాండ్ బ్యాగ్‌ను మాత్రమే తీసుకు రావాల్సి ఉంటుంది.
- ఇందుకు సంబంధించిన హోర్డింగ్‌లను, బ్యానర్లను, బోర్డులను, డిస్ప్లేలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను నిర్వహణ సంస్థలు తీసుకోవాల్సి ఉంటుంది.
- విమానాశ్రయ నిర్వహణ సంస్థలు కూడా చెకింగ్ సమయంలో వన్ హ్యాండ్ బ్యాగ్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
ఎయిర్‌పోర్టుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇటీవల దిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులు గంటలు గంటలు లగేజీలతో వేచి చూశారు. కరోనా వ్యాప్తికి ఇది కూడా కారణమయ్యే అవకాశం ఉంది.
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
Also Read: Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. కరోనా కారణంగా 55 పాసింజర్ రైళ్లు రద్దు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి