iPhone 16 Series Pre Orders: ఐఫోన్ 16 సిరీస్ ప్రీ-ఆర్డర్లు మనదేశంలో ప్రారంభం అయ్యాయి. అంటే కాస్త మొత్తంలో టోకెన్ అమౌంట్ చెల్లించి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లను రిజర్వ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన సేల్ మనదేశంలో సెప్టెంబర్ 20వ తేదీన ప్రారంభం కానుంది. ఆథరైజ్డ్ థర్డ్ పార్టీ రిటైలర్లు ఇప్పటికే వీటిపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందించారు. ఈ నాలుగు మోడల్స్‌లోనూ యాపిల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఫీచర్ ఇండియా లోకలైజ్డ్ ఇంగ్లిష్‌కు అందుబాటులోకి రావడానికి వచ్చే సంవత్సరం వరకు సమయం పడుతుందని యాపిల్ తన రోల్‌అవుట్ ప్లాన్‌లో పేర్కొంది.
ఐఫోన్ 16 సిరీస్ ధర (iPhone 16 Series Price in India)
ఐఫోన్ 16 సిరీస్ ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఇది 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఐఫోన్ 16 ప్లస్ 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.89,900 నుంచి మొదలవుతుంది. ఇది ప్రారంభ ధర. బ్లాక్, పింక్, టియల్, అల్ట్రా మెరైన్, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 16 ప్రో ధర రూ.1,19,900 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ స్టోరేజ్ కూడా 128 జీబీ నుంచే మొదలవుతుంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ.1,44,900 నుంచి మొదలవుతుంది. ఇందులో 128 జీబీ స్టోరేజ్ మోడల్ అందుబాటులో లేదు. 256 జీబీ నుంచి ప్రారంభం అవుతుంది. బ్లాక్ టైటానియం, డిజెర్ట్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం కలర్ ఆప్షన్లలో ఈ రెండు ఫోన్లూ కొనుగోలు చేయవచ్చు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
ఐఫోన్ 16 సిరీస్ ప్రీ-ఆర్డర్, సేల్ ఆఫర్లు (iPhone 16 Series Sale Offers)
ఐఫోన్ 16 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే యాపిల్ వెబ్‌సైట్లో ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ముంబైలో ఉన్న యాపిల్ బీకేసీ, ఢిల్లీలో ఉన్న యాపిల్ సాకేత్ స్టోర్లలో దీన్ని డెలివరీ తీసుకోవచ్చు. డెలివరీలకు ప్రస్తుతం నాలుగు నుంచి ఏడు రోజుల సమయం చూపిస్తుంది. డిమాండ్‌ను బట్టి ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
ఐఫోన్ 16 లాంచ్ అయినప్పుడే అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు రూ.67,500 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్, మూడు, ఆరు నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందించారు.
దీంతోపాటు ఆప్‌ట్రోనిక్స్, ఐవీనస్, ఇమాజిన్, ఐఫ్యూచర్, యూనికార్న్ వంటి థర్డ్ పార్టీ రిటైలర్లు కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆప్‌ట్రోనిక్స్, యూనికార్న్, ఇమాజిన్‌లో ఎస్‌బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఐసీఐసీఐ కార్డులపై పలు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా అదనంగా రూ.8,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉండనుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?