iPhone 15 : ఐఫోన్ ను కొంతమంది ఫ్యాషన్ గా భావిస్తారు. ఏ మోడల్ వచ్చినా.. జనరేషన్ కు తగ్గట్టు కొంటూ ఉంటారు. దాని అధిక ధర కారణంగా మరి కొంతమందికి మాత్రం ఐఫోన్ కొనాలన్న కల కలగానే ఉంటుందేమోనని భావిస్తారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. ఇప్పుడు దీని ధర భారీ స్థాయిలో తగ్గింది. రూ,69,900 ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.29,999కే అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ ధరకి ఐఫోన్ 15ను సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎక్కడ ఇది అందుబాటులో ఉంది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


iPhone 15పై బంపర్ ఆఫర్


సెప్టెంబర్ 2023లో ఆపిల్ 'వండర్‌లస్ట్' ఈవెంట్ సందర్భంగా iPhone 15(128GB, బ్లాక్)ను ప్రారంభించారు. iPhone 15 అసలు ధర రూ. 69,900. ఈ ప్రీమియం డివైజ్ ఇప్పుడు పలు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కలుపుకుని కేవలం రూ. 26,999కే అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఈ అద్భుతమైన ఆఫర్ ను అందిస్తోంది. 16 శాతం మార్క్‌డౌన్ తర్వాత రూ. 58,499 తగ్గింపు ధరకు అందిస్తోంది. అయితే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా ఈ ధరను రూ. 31,500 వరకు తగ్గించవచ్చు. అందుకు ఏం చేయాలంటే మంచి కండిషన్ లో ఉన్న ఐఫోన్ 14ను ఎక్స్‌ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 26,999కే మీ సొంతం చేసుకోవచ్చు.


15నిమిషాల్లోనే డెలివరీ


ఫ్లిప్ కార్ట్ కు చెందిన "మినిట్స్" డెలివరీ సర్వీస్.. చేసిన ప్రదేశాలలో కేవలం 14 నిమిషాల్లోనే iPhone 15ని డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ ఫీచర్ కోసం అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. ప్రొడక్ట్ మార్పిడి ఎక్స్‌ఛేంజ్, డిజిటల్ ప్రొటెక్షన్ ప్లాన్స్ ఈ ఫాస్ట్ డెలివరీ ఆప్షన్ నుంచి మినహాయింపు ఉంటుంది.


Also Read  : Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!


iPhone 15: ఫీచర్లు


6.1-అంగుళాల స్క్రీన్ 200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వచ్చిన ఐఫోన్ 15.. స్పష్టమైన, క్వాలిటీ విజువల్స్‌ను అందిస్తుంది. 0.5x, 1x, 2x జూమ్ లెవల్స్ తో ఐఫోన్ ఫొటోస్, వీడియోలను ఖచ్చితంగా పాయింట్ చేస్తుంది. క్వాడ్-పిక్సెల్ సెన్సార్, 100 శాతం ఫోకస్ పిక్సెల్‌లతో కూడిన 48MP ప్రైమరీ కెమెరా షార్ప్ అండ్ డిటెయిల్డ్ ఫొటోలను అందిస్తుంది. ఇందులోని స్మార్ట్ HDR, ఆటోమేటెడ్ పోర్ట్రెయిట్ మోడ్ వంటి కొత్త ఫీచర్లు ఫొటోగ్రఫీని సులభతరం చేస్తాయి. USB-C పోర్ట్‌ని చేర్చడం వల్ల డేటా ట్రాన్స్ఫర్ కోసం పలు కేబుల్స్ ను ఉపయోగించే ఇబ్బందిని తొలగిస్తుంది. A16 బయోనిక్ చిప్‌ ను కలిగి ఉన్న ఈ ఫోన్.. వేగవంతమైన పనితీరుకు అద్దం పడుతుంది. 



ఈ ఫ్లిప్ కార్ట్ డీల్ ఆపిల్ అత్యంత అధునాతన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకదానిని దాని అసలు ధరలో కొంత భాగానికి తగ్గిస్తుంది. ఇది టాప్ రెటెడ్ ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికతతో జత చేసే అరుదైన అవకాశాన్ని అందిస్తుంది.


Also Read  : Realme 14X 5G: రూ.15 వేలలోపే రియల్‌మీ 14ఎక్స్ 5జీ - ఫీచర్లు ఎలా ఉన్నాయి?