Realme New Phone: రియల్‌మీ 14ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇది ఐపీ69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో మార్కెట్లోకి వస్తుంది. హై టెంపరేచర్, హై ప్రెజర్ వాటర్ స్ప్రేను కూడా ఇది తట్టుకోగలదు. మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో అందించారు.
రియల్‌మీ 14ఎక్స్ ధర (Realme 14X 5G Price in India)
ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. క్రిస్టల్ బ్లాక్, గోల్డెన్ గ్లో, జ్యుయెల్ రెడ్ కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది.
ప్రారంభ సేల్ లాభాల కింద రూ.1,000 వరకు బ్యాంక్ ఆఫర్లు లభించనున్నాయి. రియల్‌మీ 14ఎక్స్ 5జీని అధికారిక వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేస్తే ఒక సంవత్సరం ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా లభించనుంది.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
రియల్‌మీ 14 ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Realme 14X 5G Specifications)
రియల్‌మీ 14ఎక్స్5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.67 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఇది 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 10 జీబీ వరకు పెంచుకోవచ్చు. రియల్‌మీ 14ఎక్స్ 5జీ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ ఓవీ50డీ ప్రైమరీ సెన్సార్‌ను అందించారు. పేరు తెలియని సెకండరీ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, గ్లోనాస్, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 197 గ్రాములుగా ఉంది. రూ.15 వేలలోపు ధరలో రియల్‌మీ లాంచ్ చేసిన 5జీ ఫోన్ ఇది. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రియల్‌మీ, ఒప్పో, వివో, ఐకూ 5జీ ఫోన్లతో పోటీ పడనుంది.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!