మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర' సంక్రాంతి రేసు నుంచి విషయం తెలిసిందే. ఈ మూవీని ప్రకటించినప్పుడే 2025 సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో సంక్రాంతికి చిరు మూవీ ఉంటుందని గట్టిగా ఫిక్స్ అయిపోయారు మెగా ఫాన్స్. కానీ రామ్ చరణ్ కోసం చిరంజీవి తన మూవీని వాయిదా వేసుకోవడంతో కాస్త డిజప్పాయింట్ అయ్యారు. అయినప్పటికీ ఆయన వారసుడు రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా వస్తుండడంతో, దాని కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే అంతలోపే మెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మైలురాయిగా మారిన 'హిట్లర్' మూవీ జనవరిలో రీరిలీజ్ కాబోతోంది.
'హిట్లర్' మూవీ రీరిలీజ్
'హిట్లర్' మూవీ రిలీజ్ 1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన మూవీ 'హిట్లర్'. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా 1996లో మలయాళంలో ఇదే టైటిల్ తో రిలీజైన బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్. ఇక ఈ హిట్లర్ మూవీ చిరంజీవికి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. రీమేక్ సినిమానే అయినప్పటికీ చిరంజీవి చాలా ఏళ్లుగా బాకీ పడిపోయిన బ్లాక్ బస్టర్ హిట్ ను ఈ మూవీనే ఇచ్చింది. నిజానికి అంతకంటే ముందు చిరంజీవి వరుస ప్లాపులతో డీలా పడిపోయారు. ఇక చిరంజీవి పని అయిపోయింది అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్న తరుణంలో, తన ఇమేజ్ కు భిన్నంగా ఐదుగురు చెల్లెలకు అన్నగా మెగాస్టార్ నటించిన 'హిట్లర్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు.
ఇక ఈ మూవీని దాదాపు రిలీజ్ అయ్యి దాదాపు 27 ఏళ్లు పూర్తవుతుంది. 1997 జనవరి 4న 'హిట్లర్' మూవీ రిలీజ్ అయింది. ఆ ఏడాది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచిన ఈ మూవీని మళ్లీ జనవరిలోనే రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. 2025 జనవరి 1న 'హిట్లర్' మూవీని రిలీజ్ చేయబోతున్నారు. దీంతో మొత్తానికి సంక్రాంతి రేసులో చిరంజీవి లేరే అన్న డిసప్పాయింట్మెంట్ మెగా అభిమానులకు తగ్గే అవకాశం ఉంటుంది.
మూడు సినిమాలు ఒకేసారి
ఎడిటర్ మోహన్ నిర్మాణంలో, సమర్పణలో వచ్చిన మూడు సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. ఆయన వచ్చే ఏడాది వరుసగా మూడు సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. 'హిట్లర్'తో పాటు మరో అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'హనుమాన్ జంక్షన్' వంటి సినిమాలను రీరిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ మూడు సినిమాలు కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లు కావడం విశేషం.
Also Read: 'రైఫిల్ క్లబ్' రివ్యూ: మలయాళ సినిమాలో ఏముంది? ఎందుకంత స్పెషల్?
సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'
ఇక ఈ సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా పొలిటికల్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్' రిలీజ్ కానుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 10న రిలీజ్ కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషన్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి.