ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న వివాదాల్లో జానీ మాస్టర్ గొడవ కూడా ఒకటి. తన అసిస్టెంట్ లేడి కొరియోగ్రాఫర్ చేసిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయన జైలుకెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన జానీ మాస్టర్ ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ (Ram Charan) తనకు ఇచ్చిన మాట గురించి వెల్లడించారు జానీ మాస్టర్.


జానీకి మాటిచ్చిన రామ్ చరణ్


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 10న రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ గురించి మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ తనకు ఇచ్చిన మాట గురించి జానీ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం వైరల్ గా మారింది. జానీ మాస్టర్ జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన కెరియర్ ముగిసినట్టేనని అందరూ భావించారు. కానీ జానీ మాస్టర్ బెయిల్ పై విడుదలైన తర్వాత స్టూడియోలో డాన్స్ ప్రాక్టీస్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా 'గేమ్ ఛేంజర్' మూవీలోని 'దోప్' సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందించారు. ఆ సాంగ్ ను 'గేమ్ ఛేంజర్' మేకర్స్ ఇటీవలే విడుదల చేశారు. 


రీసెంట్ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ మాట్లాడుతూ "జైలు నుంచి బయటకు రాగానే రామ్ చరణ్ ఫోన్ చేసి స్ట్రాంగ్ గా, హెల్దిగా ఉండు. నెక్స్ట్ బుచ్చి బాబు సినిమాలో మనం కలిసి వర్క్ చేద్దాం" అన్నారు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ రామ్ చరణ్ జానీ మాస్టర్ ట్యాలెంట్ కు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తూ, ఆయనకి సపోర్ట్ చేయడం, ఏకంగా తన నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలో అవకాశం ఇవ్వడం హర్షించదగ్గ విషయం అంటున్నారు మెగా అభిమానులు. ఇక జైలుకు వెళ్ళకముందు, వెళ్ళొచ్చిన తర్వాత ఇండస్ట్రీలో తనకు మర్యాద ఒకేలా ఉందని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే బుచ్చిబాబు-రామ్ చరణ్ కాంబోలో సినిమా షూటింగ్ మొదలైంది.


Also Read: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!






అల్లు అర్జున్ అరెస్టుపై రియాక్షన్ 


ఈ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్టు గురించి జానీ మాస్టర్ (Jani Master)కి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ విషయం గురించి ఆయన స్పందిస్తూ తానేం మాట్లాడ దలుచుకోలేదని చెప్పారు. "నేను ఓ ముద్దాయిని. ఇప్పటికే నాపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కోర్టులో కేసు నడుస్తోంది. ఇలాంటి టైంలో నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. న్యాయస్థానం పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు. ఈ ఆరోపణలు నేపథ్యంలోనే జానీ మాస్టర్ కి రావాల్సిన నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.


Also Read: టాలీవుడ్ మీద 'పుష్ప 2' ఎఫెక్ట్... ఇకపై బెనిఫిట్ షోలు ల్లేవ్ - టికెట్ రేట్లూ పెరగవ్