Whatsapp Multiple Accounts: ప్రస్తుతం ప్రపంచంలో మోస్ట్ పాపులర్ మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ నిలిచింది. ఏకంగా 200 కోట్లకు పైగా యూజర్లు ప్రపంచంలో వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. మనదేశంలో కూడా వాట్సాప్‌కు 50 కోట్ల వరకు యూజర్లు ఉన్నారు. భారతదేశంలో చాలా మంది డ్యూయల్ సిమ్ ఫోన్లు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఒక ఫోన్‌లో ఒక వాట్సాప్ ఖాతాను మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది రెండు సిమ్‌లకూ వాట్సాప్ ఖాతాలు కావాలని కోరుకుంటారు. అలాంటి వారు కింద తెలిపిన ట్రిక్స్‌ను ఫాలో అయితే సరిపోతుంది.


ఇప్పుడు లాంచ్ అవుతున్న చాలా స్మార్ట్ ఫోన్లలో ‘డ్యూయల్ యాప్స్’ అనే ఆప్షన్ అందుబాటులో ఉంటోంది. ఒప్పో, షావోమీ, వివో, శాంసంగ్, వన్‌ప్లస్, రియల్‌మీ, టెక్నో, ఇన్‌ఫీనిక్స్... ఇలా దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఆప్షన్ అందిస్తున్నారు.


డ్యూయల్ యాప్స్ ద్వారా రెండో వాట్సాప్ వాడటం ఎలా?
1. ముందుగా మీ స్మార్ట్ ఫోన్‌లో వీటి సపోర్ట్ ఉందో లేదో కంపాటిబులిటీ చెక్ చేయాలి.
2. దీని కోసం ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
3. సెట్టింగ్స్‌లో ‘డ్యూయల్ యాప్స్’ లేదా ‘డ్యూయల్ మెసెంజర్’ అని సెర్చ్ చేయండి.
4. అక్కడ ఈ రెండిట్లో ఏదైనా కనిపిస్తే మీ ఫోన్‌లో డ్యూయల్ యాప్స్ ఉన్నట్లే.
5. అందులో వాట్సాప్‌ను ఎనేబుల్ చేయండి.
6. హోం పేజీకి వచ్చేస్తే వాట్సాప్ పక్కన మరో వాట్సాప్ యాప్ కనిపిస్తుంది.
7. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుని లాగిన్ అయితే సరిపోతుంది.


వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్ ద్వారా ఇలా...
డ్యూయల్ యాప్ ద్వారా మాత్రమే కాకుండా వాట్సాప్ ఇటీవలే మల్టీ అకౌంట్ ఫీచర్‌ను కూడా తీసుకువచ్చింది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. త్వరలో ఇది కూడా అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే...


1. ముందుగా వాట్సాప్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
2. ప్రొఫైల్ పిక్చర్ పక్కన డౌన్ యారో సింబల్ కనిపిస్తుంది.
3. దానిపై క్లిక్ చేస్తే యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది.
4. అక్కడ మీరు మీ సెకండ్ సిమ్ నంబర్‌తో లాగిన్ అవ్వవచ్చు.


ఇవి రెండూ కాకుండా కొంతమంది వాట్సాప్ బిజినెస్ యాప్ వేసుకుని వాడుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఐఫోన్  అయితే జీబీ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్ వంటి థర్డ్ పార్టీ వాట్సాప్ యాప్స్‌ను మాత్రం పొరపాటున కూడా ఉపయోగించకండి. ఎందుకంటే మీ డేటా ప్రమాదంలో పడటంతో పాటు వాట్సాప్ అకౌంట్ కూడా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది.


వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. మార్కెట్లో ఇప్పటికీ వాట్సాప్ నంబర్ వన్‌గా ఉండటానికి ఇదే కారణం.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?