Viral Video:
బారికేడ్‌ని ఢీకొట్టిన కార్..
Delhi News: ఢిల్లీలో ఓ ఫ్లైఓవర్‌పై పోలీస్ బారికేడ్‌ని కార్‌తో ఢీకొట్టి లాక్కెళ్లాడు ఓ వ్యక్తి. అదే రోడ్‌పై వస్తున్న మరో వ్యక్తి ఆ తతంగాన్ని వీడియో తీశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. బ్లూ కలర్ స్విఫ్ట్ కార్ బారికేడ్‌ని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఆ బారికేడ్ కార్‌కి ఇరుక్కుపోయింది. కింద వీల్స్ ఉండడం వల్ల కార్‌తో పాటు చాలా దూరం ముందుకు వెళ్లిపోయింది. ఎప్పుడైతే ఆ వీల్స్ విడిపోయాయో అప్పుడు కార్ నుంచి విడిపోయి కింద పడిపోయింది. ఆ తరవాత కార్ ఆగిపోయింది. అయితే...ఈ వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారా లేదా అన్నది ఇంకా తెలియలేదు. అసలు ఈ ఘటనపై కేసు నమోదైందా అన్నదీ క్లారిటీ లేదు. సాధారణంగా రోడ్‌లపై ర్యాష్ డ్రైవింగ్‌ని కట్టడి చేసేందుకు పోలీసులు బారికేడ్‌లు అడ్డంగా పెడతారు. డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ వే డ్రైవింగ్‌ని నియంత్రించేందుకూ ఇవి ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా రాత్రి పూటే కీలకమైన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. అయితే...ఈ ఘటన జరిగే సమయానికి అక్కడ పోలీసులు ఎవరూ లేరు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ డ్రైవర్‌ని తిడుతుంటే మరి కొందరు మీమ్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు.
ఢిల్లీలో ఇటీవలే దారుణమైన ఘటన జరిగింది. 43 ఏళ్ల క్యాబ్ డ్రైవర్‌ని ఓ కార్ ఢీకొట్టింది. దాదాపు 200 మీటర్ల వరకూ రోడ్డుపై లాక్కెళ్లింది. వెనకాల వచ్చే కార్‌లో ఉన్న కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అర్ధరాత్రి 11.30 గంటలకు నడి రోడ్డుపై అచేతనంగా పడి ఉన్నాడు బాధితుడు. ఫరియాబాద్‌కి చెందిన బిజేంద్రగా గుర్తించారు. క్యాబ్ నడుపుతున్న డ్రైవర్ ఇలా ఎందుకు చిక్కుకుపోయాడు..? రోడ్డుపై అతణ్ని ఎందుకలా లాక్కెళ్లారు..? అని పోలీసులు విచారించారు. ఈ విచారణలో తేలిందేంటంటే...బిజేంద్ర నడుపుతున్న క్యాబ్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఎత్తుకెళ్లాలని ప్రయత్నించారు. ఈ చోరీని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు బిజేంద్ర. అడ్డు తొలగించుకునేందుకు గట్టిగా కార్‌తో ఢీకొట్టారు దుండగులు. అప్పుడే కార్ వెనకాల చిక్కుకున్నాడు. అది పట్టించుకోకుండా దాదాపు 200 మీటర్ల వరకూ అలానే లాక్కుని వెళ్లారు. కొంత దూరం తరవాత రోడ్డుపై పడిపోయాడు బిజేంద్ర. అప్పటికే తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నిందితుల కోసం గాలిస్తున్నారు.