Whatsapp: దేశంలో స్మార్ట్ ఫోన్ వాడే వారిలో 95 శాతం మంది వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. ప్రజల మధ్య కమ్యూనికేషన్‌కి, ఫొటోలు, వీడియోలు పంపుకోవడానికి వాట్సాప్ ఒక వేదికగా నిలిచింది. మనదేశంలో ఎక్కువ మంది వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే మీరు ఒకే స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సాప్‌లను రన్ చేయవచ్చని తెలుసా? అవును. మీరు చదివింది నిజమే... ఒకే స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సాప్‌లను సులభంగా రన్ చేయగల పద్ధతి గురించి తెలుసుకుందాం. దీని కోసం మీరు ఏ థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.


ఒకే యాప్‌లో మరిన్ని అకౌంట్లు...
యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి కంపెనీ ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో అనేక మార్పులు చేస్తూనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కంపెనీ వాట్సాప్‌లో అనేక ఫీచర్లను జోడించింది. అటువంటి ఫీచర్లలో ఒకటి మల్టీ-అకౌంట్ ఫీచర్. ఈ ఫీచర్ సహాయంతో మీరు ఒకే వాట్సాప్‌లో రెండు ఖాతాలను సులభంగా రన్ చేయవచ్చు. అంటే మీరు ఒకే వాట్సాప్ నుంచి రెండు నంబర్లను ఉపయోగించవచ్చు. వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది. అందుకే ఇప్పటికీ మార్కెట్లో నంబర్ వన్‌గా ఉంది.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


మొత్తం ప్రక్రియ ఏమిటి?
వాట్సాప్‌లో మల్టీ అకౌంట్ ఫీచర్‌ని ఉపయోగించడానికి, ముందుగా యూజర్ వాట్సాప్ ఖాతా ఎగువన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. దీని తర్వాత మీరు ఇక్కడ చాలా ఆప్షన్లను చూస్తారు. దీనిలో మీరు సెట్టింగ్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీరు సెట్టింగ్స్‌పై క్లిక్ చేసిన వెంటనే మీకు మళ్లీ చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ ఫోటో దగ్గర కనిపించే బాణం గుర్తుపై క్లిక్ చేయాలి.


దీని తర్వాత మీకు అక్కడ ఒక డౌన్ ఎరా సింబల్ కనిపిస్తుంది. మీరు దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మీరు Add Account ఆప్షన్‌ను చూస్తారు. అందులో మీకు అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. దీని తర్వాత మీరు అన్ని వివరాలను ఫిల్ చేయాలి. తర్వాత ‘Agree and Continue’పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది.


మీరు అదే విధానాన్ని అనుసరించడం ద్వారా మరొక అకౌంట్‌ను కూడా క్రియేట్ చేయవచ్చు. దీని తర్వాత మీరు మీ ప్రొఫైల్ ఫోటోకు వెళ్లడం ద్వారా రెండు ఖాతాల మధ్య ఛేంజ్ అవ్వవచ్చు. ఈ విధంగా మీరు ఒకే స్మార్ట్‌ఫోన్‌లో రెండు నంబర్‌లతో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?