Maruti Suzuki Cars: మారుతి సుజుకి కంపెనీ కార్లు భారత ఆటో పరిశ్రమను శాసిస్తున్నాయి. మారుతి కార్లు మంచి మైలేజీని కూడా ఇస్తాయి. దీంతో పాటు ఈ బ్రాండ్‌కు చెందిన చాలా కార్లు తక్కువ బడ్జెట్‌లో వస్తాయి. మెరుగైన మైలేజీ, తక్కువ ధర కారణంగా ఈ వాహనాలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. మారుతిలో అత్యధిక మైలేజీని ఇచ్చే కారు ఏది? దాని ధర ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతి అత్యంత ఇంధన సామర్థ్యం గల కారు ఏది?
కంపెనీ అందించే అత్యంత ఇంధన సామర్థ్యం గల కారు మారుతి గ్రాండ్ విటారా. ఇది మారుతి సుజుకికి చెందిన హైబ్రిడ్ కారు. ఈ కారులో 1462 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు. కారులోని ఈ ఇంజన్ 6,000 ఆర్పీఎం వద్ద 75.8 కేడబ్ల్యూ శక్తిని, 4,400 ఆర్పీఎం వద్ద 136.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గ్రాండ్ విటారాలో ఇంజిన్‌తో పాటు 5 స్పీడ్ మ్యాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంది. దీని హైబ్రిడ్ మోడల్ లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 3,995 ఆర్పీఎం వద్ద 59 కేడబ్ల్యూ శక్తిని, 3,995 ఆర్పీఎం వద్ద 141 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఈ మారుతి కారు పెట్రోల్ వేరియంట్ 27.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని మాన్యువల్ సీఎన్‌జీ వేరియంట్ 26.6 కిలోమీటర్ల మైలేజీని కలిగి ఉంది. మారుతి గ్రాండ్ విటారా ఎక్స్ షోరూమ్ ధర రూ. 10.99 లక్షల నుంచి మొదలై రూ. 20.09 లక్షల వరకు ఉంటుంది.
మారుతి స్విఫ్ట్ మైలేజీ ఎంత?
మారుతి అందిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలలో స్విఫ్ట్ ఒకటి. ఈ కారు జే12ఈ పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఇది 5,700 ఆర్పీఎం వద్ద 60 కేడబ్ల్యూ శక్తిని, 4,300 ఆర్పీఎం వద్ద 111.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 24.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మారుతి స్విఫ్ట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
మారుతి డిజైర్ మైలేజీ ఎంత?
కొత్త మారుతి డిజైర్‌లో 1.2 లీటర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ని అమర్చారు. ఈ ఇంజన్‌తో ఈ కారు 25.71 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ 33.73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. కొత్త డిజైర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.79 లక్షల నుంచి రూ.10.14 లక్షల వరకు ఉంది.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!