MAA Association Response on Poonam Kaur Tweets : పూనమ్ కౌర్ కాంట్రవర్సీ మరోసారి తెరపైకి వచ్చింది. డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై తనదైన శైలిలో పూనమ్ ఎప్పుడూ ట్వీట్స్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అతనిపై చర్యలు తీసుకోవడం లేదంటూ మరో ట్వీట్ చేసింది. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించింది.
త్రివిక్రమ్‌పై ఎలాంటి చర్య తీసుకోలేదు..
పూనమ్ తాజాగా ఏమి ట్వీట్ చేసిందంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై మా అసోసియేషన్ ఏ మాత్రం స్పందించలేదని.. అతనిని ఏమి ప్రశ్నించలేదని రాసుకొచ్చింది. అలాగే అతనిని మరింత ఎంక్రేజ్ చేస్తూ.. ముందుకు తీసుకెళ్తుందని ట్వీట్ చేసింది. నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని నాశనం చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్య తీసుకోలేదంటూ మండిపడింది.
మా అసోసియేషన్ రిప్లై..
పూనమ్ కౌర్ చేసిన ట్వీట్‌పై మా అసోసియేషన్ స్పందించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోశాధికారి శివబాలాజీ పూనమ్ ట్వీట్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు పూనమ్ కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. మా కంటే ముందు కూడా ఎలాంటి ఫిర్యాదు వచ్చినట్లు రికార్డులో లేదని తెలిపారు. పూనమ్ ఇలా ట్వీట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని.. మా అసోసియేషన్‌లో కానీ.. న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుందంటూ సూచించారు.
సినిమాలకు మాత్రమే దూరం..
తెలుగు, కన్నడ భాషల్లో హీరోయిన్గా చేసిన పూనమ్ కౌర్.. సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ భామ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తిగత విషయాలతో పాటు.. కాంట్రవర్సీలను కూడా సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు చెప్తూ ఉంటుంది ఈ భామ.
పవన్‌పై కూడా..
ముఖ్యంగా డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగానూ ట్వీట్స్ వేస్తూ ఉంటుంది. అసలు రీజన్ ఏంటో చెప్పకుండా.. త్రివిక్రమ్ గురించి.. ఎన్నో ట్వీట్స్ చేసింది పూనమ్. హీరో, ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కూడా పూనమ్ ఎన్నోసార్లు తన అక్కసు వెళ్లగక్కింది. అయితే ఆమె ఎన్ని ట్వీట్స్ చేసినా.. త్రివిక్రమ్, పవన్ ఇప్పటివరకు ఎలాంటి రిప్లై ఇచ్చింది లేదు. ఆమె కూడా తనకు జరిగిన అన్యాయం ఇది అంటూ నేరుగా చెప్పింది కూడా లేదు.
Also Read : ఒక్క మహిళ కూడా లేదేంటి? - ముఖ్యమంత్రితో టాలీవుడ్ పెద్దల భేటీపై పూనమ్ ఫైర్