How to Use AI Tools: ప్రపంచంలో ఏఐ టూల్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ టూల్స్ ద్వారా కథనాలు రాయడం, మీటింగ్స్ సమయంలో నోట్స్ తీసుకోవడం, మీ రోజువారీ అలవాట్లను మీకు గుర్తు చేయడం వంటి ప్రతిదాన్ని ఇవి చేయగలవు. కానీ ఈ ఏఐ టూల్స్, ముఖ్యంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM) వినియోగదారుల గోప్యతకు ముప్పును కలిగిస్తాయి. ఎందుకంటే ఈ మోడల్స్ భారీ మొత్తంలో ఆన్‌లైన్ డేటాపై శిక్షణ పొందుతారు.
ఇటీవలి సర్వే ప్రకారం 70 శాతం మంది వినియోగదారులకు ఏఐ టూల్స్ ప్రమాదాల గురించి తెలియదు. 38 శాతం మంది వినియోగదారులు అనుకోకుండా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను షేర్ చేస్తున్నారు. ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నప్పుడు గోప్యతను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
సోషల్ మీడియా ట్రెండ్స్‌పై అవగాహన ఉండాలి
సోషల్ మీడియాలో వైరల్ ట్రెండ్స్ AI చాట్‌బాట్‌లను "నా వ్యక్తిత్వం ఎలా ఉంది?" వంటి వ్యక్తిగత ప్రశ్నలను అడగమని వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. పుట్టిన తేదీ, అభిరుచులు లేదా ఆఫీస్ వంటి ఈ సమాచారం ఆన్‌లైన్ మోసానికి దారితీయవచ్చు. వినియోగదారులు తమ ప్రశ్నలను మరింత సాధారణంగా ఉంచాలని, పర్సనల్ డేటాను షేర్ చేయడం మానుకోండి అని నిపుణులు అంటున్నారు.
తల్లిదండ్రులు అనుకోకుండా తమ పిల్లల పేర్లు, పాఠశాలలు లేదా నిత్యకృత్యాల గురించి సమాచారాన్ని పంచుకుంటారు. ఇది పిల్లలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. యూఎస్ ఎఫ్‌టీసీ నివేదిక ప్రకారం 32 శాతం ఐడెంటిటీ థెఫ్ట్ కేసులు ఆన్‌లైన్‌లో ఆర్థిక సమాచారాన్ని పంచుకోవడానికి సంబంధించినవి. డేటా లీక్స్‌లో ఆరోగ్యానికి సంబంధించిన డేటా తరచుగా ఎక్కువగా లక్ష్యంగా ఉంటుంది.
ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటానికి అదనపు చిట్కాలు
ఒకే ప్రశ్నలో పేరు, పుట్టిన తేదీ, కార్యాలయం వంటి సమాచారాన్ని షేర్ చేయవద్దు.
"delete data after session" వంటి ఫీచర్లను అందించే ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోండి.
ప్లాట్‌ఫారమ్ జీడీపీఆర్, హెచ్ఐపీఏఏ వంటి ప్రైవసీ ప్రొటెక్షన్ పాలసీలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి.
మీ సమాచారం లీక్ అయిందో లేదో చెక్ చేయడానికి "HaveIBeenPwned" వంటి సాధనాలను ఉపయోగించండి.
ఏఐ టూల్స్‌ను జాగ్రత్తగా ఉపయోగించండి. మీ ప్రైవసీని కాపాడుకోండి.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?