వాట్సాప్‌లో ఇప్పుడు హైడ్ చేయాలనుకుంటున్న చాటింగ్స్‌ను పర్మినెంట్‌గా దాచేయవచ్చు. ఇంతకుముందు వాట్సాప్ చాట్‌లను ఆర్కైవ్ చేస్తే.. అవి కొత్త మెసేజ్ రాగానే అవి బయటకు వచ్చేసేవి. ఇప్పుడు అందులో కూడా మార్పులు చేశారు. మీరు ఆర్కైవ్ చేసిన చాట్‌కు కొత్త మెసేజ్ వచ్చినా.. అది మీ చాట్ లిస్ట్‌లో కనిపించదు.
ఈ ఆర్కైవ్ ఫోల్డర్‌లో మీరు ఎవరిని అయినా ఉంచితే మీరు వారిని బ్లాక్ చేయకుండానే ఇగ్నోర్ చేయవచ్చన్న మాట. జులైలో వాట్సాప్ కొత్త ఆర్కైవ్ సెట్టింగ్స్‌ను తీసుకువచ్చింది. ఇంతకుముందు మీరు ఆర్కైవ్ చేసిన వాట్సాప్ చాటింగ్‌లకు కొత్త మెసేజ్ వస్తే.. అవి వెంటనే పైకి వచ్చేవి. అంటే ఇప్పుడు మీరు వాటిని మాన్యువల్‌గా అన్ ఆర్కైవ్ చేస్తేనే బయటకు వస్తాయన్న మాట.
ఈ కొత్త ఆర్కైవ్డ్ సెట్టింగ్స్ ద్వారా వినియోగదారులు తమకు అంత ముఖ్యం కాని చాటింగ్‌లను ప్రధాన లిస్ట్‌లో కనపడకుండా దాచేయవచ్చు. దీంతోపాటు మీరు ఆర్కైవ్ చేసిన చాట్‌లిస్ట్ నుంచి మీకు మెసేజ్ వస్తే.. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు కనిపించదు.
ఇండివిడ్యువల్ చాట్ లిస్ట్‌తో పాటు గ్రూప్ చాట్‌లను కూడా మీరు ఆర్కైవ్ చేయవచ్చు. వాట్సాప్ చాట్‌లను హైడ్ చేయడానికి ఈ కింద తెలిపిన ప్రక్రియను ఫాలో అవ్వండి.
1. వాట్సాప్ ఓపెన్ చేసి.. మీరు ఆర్కైవ్ చేయాలనుకుంటున్న చాట్‌ను సెలక్ట్ చేయండి. అది గ్రూప్ చాట్ అయినా, ఇండివిడ్యువల్ చాట్ అయినా పర్లేదు.
2. ఇప్పుడు మీకు పైన మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అవే పిన్, మ్యూట్, ఆర్కైవ్. ఇందులో ఆర్కైవ్ మీద క్లిక్ చేయాలి.
3. మీరు ఆర్కైవ్ చేసిన చాట్లు చాట్ ఫీడ్‌లో కింద కనిపిస్తాయి. మీరు అందులోకి వెళ్లి.. హైడ్ అయిన చాట్లను చూడచవ్చు. వీటిని చాలా సులభంగా అన్ ఆర్కైవ్ కూడా చేయవచ్చు.
4. ఒకవేళ మీరు అన్ని చాట్లూ ఆర్కైవ్ చేయాలనుకుంటే.. చాట్స్ ట్యాబ్‌లోకి వెళ్లి అందులో మోర్ మీద సెలెక్ట్ చేయాలి. అందులో చాట్స్ మీద క్లిక్ చేసి.. చాట్ హిస్టరీలోకి వెళ్లాలి. అక్కడ ఆర్కైవ్ ఆల్ చాట్స్‌పై క్లిక్ చేయాలి.
Also Read: Oppo K9s: ఒప్పో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర బడ్జెట్‌లోనే.. అదిరిపోయే లుక్!
Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?