YouTube: యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ యాప్‌లలో ఒకటి. చాలా సార్లు మనం మంచి క్వాలిటీ వీడియోలను చూడాలనుకున్నప్పుడు, మన ఇంటర్నెట్ కనెక్షన్ సపోర్ట్ చేయదు. తక్కువ డేటా వేగం కారణంగా, వీడియోను సరిగ్గా స్ట్రీమ్ చేయలేరు. దీని కోసం యూట్యూబ్ యాప్‌లోనే వీడియోను సేవ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీకు కావాలంటే మీ ఫోన్ స్టోరేజ్‌లో హెచ్‌డీ క్వాలిటీలో వీడియోను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


డైరెక్ట్‌గా యాప్‌లోనే...
మీరు వీడియోను ఆఫ్‌లైన్‌లో చూడాలనుకుంటే, యాప్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు యూట్యూబ్ యాప్‌లో ఏదైనా వీడియోను ఓపెన్ చేసినప్పుడు, దాని క్రింద డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఆ డౌన్‌లోడ్ బటన్‌పై నొక్కండి. అప్పుడు డౌన్‌లోడ్ స్టార్ట్ అవుతుంది.


ఏ కంటెంట్ డౌన్‌లోడ్ చేసినా మీరు దానిని యూట్యూబ్‌లోని లైబ్రరీ విభాగంలో చూడవచ్చు. అప్పుడు మీరు దిగువ మీ ప్రొఫైల్ సింబల్‌పై నొక్కాలి. అక్క డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీరు సేవ్ చేసిన వీడియోను చూడగలరు.


డైరెక్ట్‌గా ఫోన్‌లో కూడా...
యూట్యూబ్ వీడియోలను మీ ఫోన్ లోకల్ స్టోరేజీకి డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారి కోసం ఒక పద్ధతి ఉంది. దీని కోసం ముందుగా మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న యూట్యూబ్ వీడియోను క్రోమ్ లేదా ఇతర బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలి. అక్కడ యూఆర్ఎల్‌కు ముందు మీరు ‘ss’ అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. దీని తర్వాత ఒక థర్ట్ పార్టీ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు కావాల్సిన రిజల్యూషన్‌ని ఎంచుకుని, డౌన్‌లోడ్‌పై నొక్కండి.


వెబ్ సైట్ల ద్వారా కూడా...
పై రెండు పద్ధతులే కాకుండా, మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే శోధించినప్పుడు, యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి ఉపయోగపడే అనేక ఇతర పద్ధతులను కూడా కనుగొంటారు. మీరు వీటిలో దేనినైనా ప్రయత్నించవచ్చు.


మరోవైపు యూట్యూబ్ తన వినియోగదారుల కోసం ఇటీవలే కొత్త ఫీచర్‌ను అందించింది. వినియోగదారులు తమ వాచ్ హిస్టరీని డిజేబుల్ చేస్తే యూట్యూబ్ రికమండేషన్లు కూడా ఆగిపోతాయి. అంటే మీ యూట్యూబ్ మొబైల్ యాప్ హోం స్క్రీన్ ఖాళీగా ఉంటుంది అన్న మాట. ఈ ఫీచర్‌ను ఇప్పటికే యూట్యూబ్ విడుదల చేసింది. కొందరికి మాత్రం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. కొంతమందికి యూట్యూబ్ అల్గారిథం ఆటోమేటిక్‌గా ఇచ్చే సజెషన్స్ నచ్చవు. మనకు ఇంట్రస్ట్ లేనివన్నీ ఫీడ్‌లోకి వచ్చేస్తున్నాయని అనుకుంటున్నారు. ఈ కొత్త ఫీచర్ ఎనేబుల్ చేయడం ద్వారా మీరు యూట్యూబ్ వాచ్ హిస్టరీ డిజేబుల్ చేసుకుంటే వీడియో రికమండేషన్లను కంపెనీ నిలిపివేస్తుంది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial