SRM Admissions: చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాలలో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


ప్రోగ్రామ్‌ వివరాలు..


* పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌


అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ (కంప్యూటర్‌ సైన్సు అండ్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


ఫెలోషిప్‌: నెలకు రూ.38,750 నుంచి రూ.43,750.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.10.2023.


Notification 


Website


ALSO READ:


ఇంటర్‌ పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దరఖాస్తుకు డిసెంబరు 31 వరకు గడువు
తెలంగాణలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై... ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు 'నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌'కు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 31 వరకు గడువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్‌ మార్కుల్లో టాప్‌-20 పర్సంటైల్‌లో నిలిచిన 53,107 మంది ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యార్థులతోపాటు గతంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారు కూడా రెన్యువల్‌ కోసం డిసెంబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 
స్కాలర్‌షిప్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు, ప్రవేశాలు ఇలా
గుంటూరులోని ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు. ఈ కోర్సుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభంకాగా.. నవంబరు 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ (ఐకార్‌) స్కోరు; పీహెచ్‌డీ కోర్సులకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ (ఐకార్‌) స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలో పీజీడీఎం ప్రోగ్రామ్, ఈ అర్హతలుండాలి
పుణెలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, 2024 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్‌ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...