UPI Payment: నేటి డిజిటల్ యుగంలో ప్రజలు తమ పనులన్నీ ఆన్‌లైన్‌లోనే చేసేస్తున్నారు. షాపింగ్ చేసినా లేదా ఏదైనా ఆర్డర్ చేసినా, ఈ రోజుల్లో చాలా వరకు పనులు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. అదే సమయంలో యూపీఐ పేమెంట్ సర్వీస్ ప్రజలు డబ్బు లావాదేవీలు చేయడాన్ని చాలా సులభతరం చేసింది. ఇప్పుడు ప్రజలు రిటైల్ షాపుల నుంచి మాల్స్ వరకు ఆన్‌లైన్ చెల్లింపులు చేయవచ్చు. భారతదేశంలో యూపీఐ సర్వీసు 2016లో మొదలైంది. దీని తర్వాత యూపీఐ సర్వీసులో దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందింది.


ఎన్‌పీసీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం యూపీఐ చెల్లింపుల విషయంలో భారతదేశం చైనా, అమెరికా వంటి పెద్ద దేశాలను అధిగమించింది. భారతీయ యూపీఐ... చైనాకు సంబంధించిన అలిపే, అమెరికా పేపాల్‌లను కూడా అధిగమించింది. ఇంటర్నెట్ లేకుండా కూడా దేశంలో యూపీఐ చెల్లింపులు చేసే అవకాశం ఉంది.


ఇంటర్నెట్ లేకుండా పేమెంట్స్ ఎలా చేయాలి?
మీ సమాచారం కోసం యూపీఐ పేమెంట్ ఇంటర్నెట్ సహాయంతో జరుగుతుంది. అయితే యూపీఐ పేమెంట్ చేస్తున్నప్పుడు చాలా సార్లు వినియోగదారులు ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా లేని కారణంగా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్‌పీసీఐ కొన్ని రోజుల క్రితం ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్ చేసే సౌకర్యాన్ని ప్రారంభించింది. మీరు కూడా ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయాలనుకుంటే అది ఇప్పుడు సాధ్యమే. కానీ దానికి మీరు సీక్రెట్ కోడ్‌ను గుర్తుంచుకోవాలి. కొన్ని స్టెప్స్‌ను కూడా ఫాలో అవ్వాలి.


గుర్తుంచుకోవాల్సిన కోడ్ ఇదే...
ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్ చేయాలంటే మీరు ఒక కోడ్ గుర్తుంచుకోవాలి. యూపీఐ పేమెంట్స్ సర్వీసును పొందడానికి ముందుగా మీ ఆధార్, మొబైల్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడం అవసరం. యూపీఐ ఐడీ ఇప్పటికే బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్‌ని ఉపయోగించి క్రియేట్ చేసి ఉండాలి. యూపీఐ ఐడీని క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఇంటర్నెట్ లేకుండా కూడా మీరు యూపీఐ చెల్లింపు ఎలా చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


1. ఆఫ్‌లైన్ యూపీఐ పేమెంట్ చేయడానికి మీరు రహస్య యూఎస్‌ఎస్‌బీ కోడ్ '*99#'ని గుర్తుంచుకోవాలి.


2. దీని తర్వాత మీ ఫోన్ డయల్ ప్యాడ్‌లో ఈ కోడ్‌ని టైప్ చేసి కాలింగ్ బటన్‌ను నొక్కండి.


3. దీని తర్వాత మీకు స్క్రీన్‌పై *99#కి స్వాగతం అనే సందేశం వస్తుంది. ఇప్పుడు స్క్రీన్‌పై మీరు ఓకే అనే దాన్ని ప్రెస్ చేయాలి.


4. ఆ తదుపరి పేజీలో మీరు డబ్బు పంపడం, డబ్బు అభ్యర్థించడం, బ్యాలెన్స్ చెక్ చేయడం, మీ ప్రొఫైల్, పెండింగ్ రిక్వెస్ట్, ట్రాన్సాక్షన్లు, యూపీఐ పిన్ వంటి అనేక ఆప్షన్లను పొందుతారు.


5. ఇప్పుడు మీరు పేమెంట్ చేయాలనుకుంటే, మీరు సెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి లేదా మీరు పేమెంట్స్ స్వీకరించాలనుకుంటే, మీరు రిక్వెస్ట్ మనీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.


6. దీని తర్వాత మీరు మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ మొదలైన ఆప్షన్‌లను పొందుతారు. వీటిలో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవాలి.


7. ఆ తర్వాత మీరు ఎవరికి యూపీఐ పేమెంట్ చేయాలనుకుంటున్నారో వారి వివరాలను నమోదు చేయాలి.


8. వివరాలను ఫిల్ చేసిన తర్వాత మీరు మీ యూపీఐ పిన్‌ను నమోదు చేయాల్సిన తదుపరి పేజీకి వెళ్లండి.


9. అదేవిధంగా మీరు ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్ సేవను ఆఫ్‌లైన్‌లో కూడా పొందవచ్చు.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?