టెలికాం ఆపరేటర్లు త్వరలో 5జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధం అవుతోంది. హై స్పీడ్ ఇంటర్నెట్, లో లేటెన్సీ మొబైల్ ఇంటర్నెట్ సేవలను 5జీ ద్వారా అందిస్తామని కంపెనీలు అంటున్నాయి. చాలా మంది 4జీ నుంచి 5జీకి అప్‌గ్రేడ్ అవ్వడం అంటే ఇంటర్నెట్ స్పీడ్ పెరగడం మాత్రమే అనుకుంటారు. కానీ అంతకుముంచి మారేవి చాలా ఉన్నాయి. 1జీ నుంచి 6జీ వరకు ఏం మార్పులు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.


1జీ: వాయిస్ కాల్స్
ఇప్పుడు సన్నటి టచ్ స్క్రీన్లు, ఫోల్డబుల్ స్క్రీన్లతో ఫోన్లు వచ్చాయి కానీ ఒకప్పుడు మొబైల్స్ చాలా లావుగా, బరువుగా, బల్కీగా ఉండేవి. స్క్రీన్లు ఉండేవి కావు, పెద్ద యాంటెన్నాలు, భారీ బ్యాటరీలతో వచ్చేవి. నెట్ వర్క్ సరిగ్గా వచ్చేది కాదు. బ్యాటరీ టైమ్ కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ అక్కడే మొబైల్ నెట్‌వర్క్ ప్రారంభం అయింది.


ఫస్ట్ జనరేషన్ ద్వారా రెండు సపోర్టెడ్ డివైసెస్ మధ్య కమ్యూనికేషన్ సాధ్యం అయింది. అనలాగ్ సిస్టం ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని ఈ ఫోన్లు కల్పించాయి. అయితే కాల్ క్వాలిటీ చాలా తక్కువగా ఉండేది. అయితే 1జీ కేవలం స్థిరమైన భౌగోళిక ప్రాంతంలో మాత్రమే పనిచేసేది. అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు.


2జీ: టెలిఫోనీ సర్వీసెస్
మొదటి తరం మొబైల్ నెట్‌వర్క్‌లో ఉన్న కొన్ని లోపాలను సవరించింది. అలాగే కొత్త సామర్థ్యాలు కూడా పరిచయం చేసింది. అనలాగ్ సిస్టంను మరింత అడ్వాన్స్‌డ్ డిజిటల్ టెక్నాలజీ రీప్లేస్ చేసింది. దీనికి గ్లోబల్ సిస్టం ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ (జీఎస్ఎం) అని పేరు పెట్టారు. 1జీ కంటే మెరుగైన క్వాలిటీ వాయిస్ కాల్స్‌ను ఇది అందించింది. దీంతోపాటు షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్ఎంఎస్), మల్టీమీడియా మెసేజ్ సర్వీస్ (ఎంఎంఎస్)లు కూడా 2జీతోనే అందుబాటులోకి వచ్చాయి.


దీంతోపాటు రోమింగ్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో వినియోగదారులు ఎక్కడికి వెళ్లినా కాల్స్ మాట్లాడటం, మెసేజ్‌లు పంపడం, అందుకోవడం వంటివి చేయగలిగారు. దీంతోపాటు జనరల్ పాకెట్ రేడియో సర్వీస్ (జీపీఆర్ఎస్), ఎన్‌హేన్స్‌డ్ డేటా జీఎస్ఎం ఎవల్యూషన్ (ఎడ్జ్) ద్వారా ఇంటర్నెట్ వాడుకునే అవకాశం కూడా కలిగింది. 3జీ రావడాని కంటే ముందు 2.5జీ కూడా తీసుకువచ్చారు.


3జీ: యాప్స్ అందుబాటులోకి
3జీ మొబైల్ నెట్‌వర్క్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఇవి స్మార్ట్ ఫోన్లు, యాప్ ఎకో సిస్టంలకు రంగం సిద్ధం చేశాయి. మొబైల్ టెలివిజన్, ఆన్‌లైన్ రేడియో సర్వీసులు, వీడియో కాలింగ్, మొబైల్ ఫోన్ యాప్స్ 3జీ ద్వారా సాధ్యం అయ్యాయి. ఇదే సమయంలో ఐఫోన్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో 3జీ ఇంటర్నెట్ సెకనుకు కిలోబైట్లలో ఇంటర్నెట్ స్పీడ్ ఉండేది.


2జీ తరహాలోనే 3జీ నుంచి 4జీకి మధ్యలో కూడా 3.5జీ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ సెకనుకు మెగాబైట్లకు (ఎంబీ) పెరిగింది. హై స్పీడ్ డౌన్‌లింక్ పాకెట్ యాక్సెస్ (హెచ్ఎస్‌డీపీఏ), హై స్పీడ్ అప్‌లింక్ పాకెట్ యాక్సెస్ (హెచ్ఎస్‌యూపీఏ) ద్వారా ఇది సాధ్యం అయింది.


4జీ: ఇంటర్నెట్ కాలింగ్
4జీకి అవసరమైన వేదికను 3జీ సెట్ చేసింది. 3జీ ద్వారా హెచ్‌డీ వీడియో కాల్స్, ఇతర ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తే... 4జీ ద్వారా అత్యధిక డేటా రేట్, మొబైల్ నెట్‌వర్క్‌లు సపోర్ట్ చేసే అడ్వాన్స్‌డ్ మల్టీమీడియా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ (ఎల్టీఈ) సేవలు కూడా ప్రారంభం అయ్యాయి. ఇది డేటా రేట్‌ను పెంచడం మాత్రమే కాకుండా వాయిస్, డేటాను ఒకేసారి అందుకునే ఫీచర్‌ను కూడా తీసుకువచ్చాయి.


ఇంటర్నెట్ కాలింగ్, వాయిస్ ఓవర్ ఎల్టీఈ (వోల్టే) వంటి ఎన్నో ఫీచర్లను 4జీనే పరిచయం చేసింది. వాయిస్ ఓవర్ వైఫై (వో వైఫై) కూడా 4జీ ద్వారానే అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా నెట్ వర్క్ తక్కువగా ఉన్ ప్రాంతాల్లో వైఫై ద్వారా కాలింగ్ చేసుకోవచ్చు.


5జీ: ఐవోటీ, ఎంటర్‌ప్రైజెస్
1జీ నుంచి 4జీ వరకు మొబైల్ నెట్‌వర్క్ ద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలోనే మార్పులు వచ్చాయి. అయితే 5జీ మాత్రం కొంచెం వేరుగా ఉండనుంది. దీని ద్వారా లో లేటెన్సీ అందుబాటులోకి రానుంది. అంటే ఇది వ్యాపారాలకు బాగా ఉపయోగపడనుందన్న మాట. మెటావర్స్‌లో టెక్నాలజీలకు కూడా 5జీ ఎంతో ఉపయోగపడనుంది. దీని ద్వారా హై స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్ సాధ్యం కానుంది. సెకనుకు జీబీల్లో డేటా స్పీడ్‌ను 5జీ అందించనుంది.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?