శివాజీ గణేషన్.. పరిచయం అవసరం లేని పేరు. తెరమీద ఆయన పోషించిన లక్షలాది మంది సినీ ప్రియుల హృదయాల్లో నిలిచిపోయారు. నేడు ఆయన 93వ జయంతి. ఈ సందర్భంగా గూగుల్ ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించి, ఆయనకు నివాళిని అర్పించింది.
ఈ గూగుల్ డూడుల్‌ను బెంగళూరు చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ నూపుర్ రాజేష్ చోక్సి రూపొందించారు. భారతీయ సినిమా చరిత్రలో మార్లన్ బ్రాండోగా ఆయనకు పేరుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, సింహళ సినిమాల ద్వారా.. ఆయన అన్ని భాషల ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఉన్న విల్లుపురం గ్రామంలో ఈయన జన్మించారు. శివాజీ గణేషన్ అసలు పేరు విల్లుపురం చిన్నయ్య గణేషన్. ఏడు సంవత్సరాల వయసు నుంచే ఈయన నటించడం ప్రారంభించారు. ప్రముఖ నాటక గ్రూపుల్లో ఈయన స్త్రీ పాత్రలు పోషించేవారు. భారతనాట్యం, కథక్, మణిపురి నాట్యాల్లో కూడా ఈయనకు మంచి ప్రావీణ్యం ఉంది.
Also Read: పెళ్లికాకుండానే తల్లైన సిరి హన్మంత్.. ఇదిగో బాబుతో ఉన్న ఫొటో..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై స్క్రీన్ ప్లే అందించి, దర్శకత్వం వహించిన శివాజీ కాండ సామ్రాజ్యంలో ఈయన మరాఠా చక్రవర్తి శివాజీ పాత్ర పోషించారు. ఆ పాత్రకు ఎంతో పేరు రావడంతో ఆయన దాన్నే తన పేరుగా మార్చుకున్నారు. డీఎంకే నాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి స్క్రీన్‌ప్లే అందించిన పరాశక్తి సినిమా ఆయనకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.
శివాజీ గణేషన్ నటించిన పాత్రలు ఎన్నోసార్లు విమర్శకుల ప్రశంసలు ఎంచుకున్నాయి. ఈయనకు నడిగర్ తిలగం అనే బిరుదు కూడా ఉంది. అయితే అంత మంచి నటుడి కెరీర్‌లో ఒక్క జాతీయ అవార్డు కూడా లేదు. 1992లో తేవర్ మగన్ (తెలుగులో క్షత్రియ పుత్రుడు) సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చినా ఆయన అవార్డునే తిరస్కరించాడు.
ఫ్రెంచ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘చెవలీర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ హానర్’ అవార్డు లభించింది. అయితే ఎంజీఆర్, కరుణానిధి తరహాలో శివాజీ రాజకీయాల్లో సఫలం కాలేకపోయాడు. ఈయన 2001లో తన 73 సంవత్సరాల వయసులో మరణించారు.
Also Read: సాయి ధరమ్ తేజ్.. ‘రిపబ్లిక్’ ఎలా ఉంది? ప్రేక్షకుల రివ్యూ ఇదే..
Also Read: సూర్య కిరీటమే నీవా..క్యూట్ లుక్ లో మైమరపిస్తున్న శ్రియా శరణ్