ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఇది వ్యాపార ప్రకటనలోని ట్యాగ్ లైన్ కాదు. నిజంగానే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. దానికి మన కళ్ల ముందే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఐడియాలతో కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేయాల్సిన పని లేదు. ఉన్న వాటినే కొత్తగా మార్చొచ్చు. ఇలాంటివి చేసినప్పుడు అందరూ అబ్బురపడతారు. అవే ఐడియాలు అని నలుగురికి చెబుతారు. మహింద్రా గ్రూప్ ఓనర్ ఆనంద్ మహింద్రా చేసిన ఓ ట్వీట్‌లో ఇలాంటి ఐడియాను గురించి చెప్పారు. ఆ ఐడియానే పుల్ల ఇడ్లీ.


Also Read : వర్క్ ఫ్రం హోం ఇక ముగిసినట్లే.. ఆఫీసులు తెరవనున్న దిగ్గజ కంపెనీల జాబితా ఇదే..


ఇడ్లీలు ఎలా ఉంటాయి..? ఎలా ఉండేదేముంది... గుండ్రంగా ఉంటాయి. అని అనుకుంటాం కదా.. మన ఆలోచనలు అక్కడే ఉండిపోయాయి. కానీ వాటిని పిల్ల ఇడ్లీలుగా కూడా చేయవచ్చని బెంగళూరులోని ఓ క్రియేటివ్ హోటల్ యజమాని నిరూపించాడు. అంటే ఐస్‌ లాగానే ఇడ్లీల మధ్యలో పుల్ల పెడ్డి ఉడికిస్తున్నారు. పుల్ల సాయంతో ఇడ్లీని చట్నీ, సాంబార్‌లో ముంచుకుని తినేలా తయారు చేశారు. ఇది చాలా మందిని ఆకర్షించింది. అందరితో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహింద్రా గ్రూప్ ఓనర్ ని కూడా ఆకర్షించింది. వెంటనే ఆయన విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు.






Also Read: రోజుకు వెయ్యి కోట్లు ఆర్జిస్తున్న అదానీ.. ఇండియా టాప్‌-10 కుబేరులు వీళ్లే


మహింద్రా ఈ పుల్ల ఇడ్లీపై అభిప్రాయాలను చెప్పాలని కోరారు. ఆయన ట్వీట్ కూడా వైరల్ అయింది. అద్భుతమైన ఆలోచన అని చాలా మంది అభినందించాు. మరికొందరు అలాంటి వినూత్న ఆలోచనలతో తయారు చేసిన వంటకాలను పోస్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ పుల్ల ఇడ్లీ గురించి ఎంక్వయిరీలు కూడా ప్రారంభమయ్యాయి. 


Also Read: Amazon Great Indian Festival Sale: మొబైల్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.38 వేలు తగ్గింపు!


ముందు ముందు హోటళ్లలో పుల్ల ఇడ్లీలు కూడా స్పెషల్ మెనూగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణంగా ఇడ్లీని చేతుల్లో తుంపుకుని తింటారు. స్పూన్‌తో తినడం కాస్త ఇబ్బందికరమే. ఇప్పుడు పుల్ల ఇడ్లీల వల్ల ఇడ్లీని మరింతగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. అందుకే మీరెప్పుడైనా వేరే హోటల్‌కు వెళ్తే అక్కడ మెనూలో పుల్ల ఇడ్లీ అని కనిపిస్తే ఆశ్చర్యపోకండి. 


Watch Video : పోలీసు స్టేషన్‌లో నెవ్వర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌ సీన్‌.. పోలీసు అధికారికి ట్రాన్స్‌జెంజర్స్‌ సన్మానం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి