‘బిగ్ బాస్’ సీజన్ 5 యాక్టివ్ కంటిస్టెంట్స్‌లో సిరి హన్మంతు టాప్ 5 లోనే ఉంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి ఇప్పటివరకూ ఎక్కడా జోష్ తగ్గలేదు. ‘బిగ్ బాస్’ సీజన్ 5 తొలి కెప్టెన్ అవడమే కాదు టాస్కుల్లోనూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుందనే క్రెడిట్ కొట్టేసింది. ఆ మధ్య బిగ్ బాస్ ఇచ్చిన 'మరపురాని తొలిప్రేమ' టాస్కులో భాగంగా ఫస్ట్ లవ్ గురించి మాట్లాడిన సిరి ఇంటి సభ్యులతో పాటూ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. తన ఫస్ట్ లవ్ గురించి సిరి అప్పుడు ఏం చెప్పిందంటే.. ‘‘అతడి పేరు విష్ణు..అందరూ ముద్దుగా చిన్నా అంటారు. ఇద్దరం ఎదురెదురు ఇళ్లలో ఉండేవారం. మా లవ్ టెన్త్ క్లాసులో మొదలైంది. తను ప్రపోజ్ చేయగానే ఒప్పేసుకున్నా. తెల్లారితే నిశ్చితార్థం అనగా ఇంట్లోంచి వెళ్లిపోయా. ఆ తర్వాత మా అమ్మ నచ్చజెప్పడంతో మళ్లీ ఇంటికి తిరిగొచ్చా. అప్పటి నుంచి సంతోషంగా తనతో రిలేషన్ కొనసాగించా కానీ ఓ రోజు తెల్లవారుజామునే అకస్మాత్తుగా మెలుకువ వచ్చింది. మళ్లీ నిద్రపోయా. అయితే అదే నాకు మెలుకువ వచ్చిన సమయంలోనే తనకి యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు" అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది సిరి. అయితే మళ్లీ ఇదంతా ఎందుకంటే సిరి హన్మంతు తల్లైంది. ఈ ఫొటో చూస్తే మీకే అర్థమవుతుంది.
సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ మెప్పించిన యూట్యూబ్ స్టార్ సిరి హన్మంతుకి ఈ మధ్యే నటుడు శ్రీహాన్‌తో నిశ్చితార్థం జరిగింది. ఇంతలోనే బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో ప్రియుడిని ఒంటరిగా వదిలేసి షోలో ఎంట్రీ ఇచ్చింది. అయితే వీరిద్దరికీ ఓ కొడుకు ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో కొంత నిజం, కొంత అబద్ధం ఉందండోయ్. వీళ్లిద్దరకీ ఓ బాబు ఉన్నాడన్నది నిజమే. కానీ ఆ బాబుని వీళ్లు దత్తత తీసుకున్నారు. ఆ మధ్య ఓ నెటిజన్ చైల్డ్ ఆర్టిస్ట్ చైతూని అడాప్ట్ చేసుకుంటున్నారా? అని ప్రశ్నించగా అవునని సమాధానమిచ్చింది సిరి. ఆమె నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్న సిరి- శ్రీహాన్ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి ఎంటరైన యూట్యూబర్ సిరి హన్మంత్.. ఫస్ట్ వీక్ నుంచి ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పిస్తోంది. బయట కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ఈమధ్యే తన ఇన్ స్టాగ్రామ్‌లో 4 లక్షల ఫాలోవర్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో సిరి ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆమె టీం పోస్ట్ పెట్టింది.
Also Read: కత్తులతో ఫసక్.. సన్నీకి చుక్కలు చూపించిన హౌస్‌మేట్స్, కెప్టెన్ ఎవరంటే..
Also Read:‘కొండపొలం’ సాంగ్.. ‘శ్వాసలో హద్దులని దాటాలనే ఆశ’ అంటూ రకుల్‌తో తేజ్ రొమాన్స్!