'విలన్లు లేరీ నాటకంలో' అని సాయి కుమార్ చెప్పిన డైలాగ్ వినగానే ప్రస్థానం సినిమా ఠక్కున గుర్తొస్తుంది. సినిమా అంతా ఓ లెక్క క్లైమాక్స్ మరో లెక్క అన్నట్టుంటుంది. ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో ఆ సినిమా అలా నిలిచిపోయింది. ఈ మూవీ దర్శకుడు దేవకట్టా రీసెంట్ గా తెరకెక్కించిన రిపబ్లిక్ ఈ రోజు విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ, జగపతి బాబు  నటించిన ఈ సినిమాపై మొదట్నుంచీ అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.  ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురికావడంతో ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అయితే తన కోరిక మేరకు ఈ సినిమాని ఈ రోజు థియేటర్లలో విడుదల చేశారు. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో తేజూ నటనపై ప్రశంశలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు.


రిపబ్లిక్ సినిమా పై ప్రేక్షకుల ట్వీట్స్ ఇవే





నువ్ ఈ సిస్టింలో ఉండలేకపోతే.. సిస్టం నుంచి బయటకు వెళ్లగొట్టబడతావ్ అంటూ దేవా కట్టా రాసిన డైలాగ్‌ను ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని ప్రశంసలు కురిపించాడు. 






చేయాల్సిన మర్డర్స్, కరప్షన్ మొదటి మూడేళ్లు ప్లాన్ చేసుకో.. ఓట్ల కోసం పథకాలు చివరి రెండేళ్లు ప్లాన్ చేద్దాం..డైలాగ్ బాగా పేలిందన్నాడు మరో నెటిజన్. 






ఫుల్ సీరియస్ మూవీ అని కొందరు, మొదటి సీన్ నుంచి నేరుగా వైసీపీ మీదే కౌంటర్లు వేసినట్టు అనిపిస్తోందని మరి కొందరు ట్వీ ట్ చేశారు.


#Republic is thought provoking & well written considering current political scenarios@meramyakrishnan as Vishaka vani 🔥#SaiDharamTej congrats


— Chowkidar keerthy v (@Keerthireddyoff) September 30, 2021 


నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన వారిపై మరికొందరు ఫైరయ్యారు.






చూస్తున్నంత సేపు ఆలోచించేలా ధియేటర్ బయటకి వచ్చాక కూడా మనసులో నిలిచే చిత్రం 'రిపబ్లిక్' అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు


#Republic Friends that saw night premiere shows liked it 👍


— Venky Reviews (@venkyreviews) October 1, 2021


సినిమాలో  పోసాని కృష్ణమురళి కనిపించినప్పుడల్లా ఫ్యాన్స్ బూతులవర్షం కురిపించారని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.



సినిమా ఫస్టాఫ్ సూపర్, సెకండాఫ్ బాగానే ఉంది. తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అని మరొకరు ట్వీట్ చేశారు.






'రిపబ్లిక్' సాయి ధరమ్ తేజ్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్నందిస్తుందన్నాడు మరో నెటిజన్. ఓవరాల్ గా చూస్తే 'రిపబ్లిక్ ' మూవీపై పాజిటివ్ టాక్ వచ్చిందనే చెప్పుకోవాలి..


Also Read: కత్తులతో ఫసక్.. సన్నీకి చుక్కలు చూపించిన హౌస్‌మేట్స్, కెప్టెన్ ఎవరంటే..


Also Read:‘కొండపొలం’ సాంగ్.. ‘శ్వాసలో హద్దులని దాటాలనే ఆశ’ అంటూ రకుల్‌తో తేజ్ రొమాన్స్!


Also Read:పెళ్లికాకుండానే తల్లైన సిరి హన్మంత్‌... ఇదిగో బాబుతో ఉన్న ఫొటో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి