ఐకూ మనదేశంలో వైర్‌లెస్ స్పోర్ట్ నెక్‌బ్యాండ్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. గతేడాది చైనాలో లాంచ్ అయిన ఐకూ నెక్ బ్యాండ్‌ను కంపెనీ మనదేశంలో ఇప్పుడు లాంచ్ చేసింది. గేమింగ్ కోసం వైర్ లెస్ ఇయర్‌ఫోన్స్ కావాలనుకునే వారికోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించారు.
ఐకూ వైర్‌లెస్ స్పోర్ట్ నెక్ బ్యాండ్ ధర
వీటి ధరను రూ.1,799గా నిర్ణయించారు. అమెజాన్, ఐకూ ఇండియా అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అయితే వీటికి సంబంధించిన సేల్ ఎప్పుడు జరగనుందో మాత్రం కంపెనీ అధికారికంగా తెలపలేదు.
ఐకూ వైర్‌లెస్ స్పోర్ట్ నెక్ బ్యాండ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
వీటిలో 11.2 ఎంఎం డ్రైవర్లను అందించారు. ఐపీఎక్స్4 రేటెడ్ బిల్డ్ కూడా వీటిలో ఉండటం విశేషం. వాటర్, స్వెట్ రెసిస్టెన్స్‌ను ఇందులో అందించింది. కాపర్ క్లాడ్ అల్యూమినియం వైర్ ఈ డ్రైవర్లలో ఉండటం విశేషం. ఎక్కువ బేస్ ఉన్న అవుట్‌పుట్‌ను ఇది అందించనుంది.
ఒక్కసారి చార్జ్ పెడితే ఏకంగా 18 గంటల ప్లేబ్యాక్ టైంను ఇది అందించనుందని తెలుస్తోంది. బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీతో ఈ ఇయర్ బడ్స్ లాంచ్ అయ్యాయి. వీటి లేటెన్సీ కేవలం 80 మిల్లీ సెకన్లు మాత్రమే. దీంతోపాటు ఇందులో బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్, మీడియా కంట్రోల్స్ కూడా ఉన్నాయి. చార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?