Laptop Battery Saving Tips in Telugu: కోవిడ్ మహమ్మారి తర్వాత ఆఫీసు పనికి డెస్క్‌టాప్‌లకు బదులుగా ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ల్యాప్‌టాప్ ఉంటే ఎక్కడినుంచైనా సులభంగా పని చేయవచ్చు కాబట్టి. ఇటువంటి పరిస్థితిలో మనం ఎక్కువ సమయం ల్యాప్‌టాప్‌తో గడుపుతాం. అందుకే ప్రజలకు ల్యాప్‌టాప్‌ల్లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అవసరం. మీరు ఎక్కువ కాలం నుంచి ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తూ, దాని బ్యాటరీ త్వరగా అయిపోతున్నట్లయితే దాని గురించి బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్స్ ఫాలో అయితే మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ చాలా కాలం పాటు ఉంటుంది.


సెట్టింగ్స్‌లో ఈ మార్పులు చేయాలి!
దీని కోసం మీ ల్యాప్‌టాప్ సెట్టింగ్‌లలో స్వల్ప మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా మీరు మీ ల్యాప్‌టాప్‌ని ఉపయోగించే విధానాన్ని మార్చడం ద్వారా దాని బ్యాటరీ జీవితాన్ని కూడా మెరుగుపరచవచ్చు. కాబట్టి మీరు ల్యాప్‌టాప్ బ్యాటరీని త్వరగా డ్రైన్ అవ్వకుండా ఎలా సేవ్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.


మీరు మీ ల్యాప్‌టాప్ బ్యాటరీని ఎక్కువసేపు ఉంచాలనుకుంటే ముందుగా దాని వినియోగాన్ని నిరోధించడానికి ప్రయత్నించండి. బ్యాటరీని ఆదా చేయడానికి ప్రతి ల్యాప్‌టాప్‌కు పవర్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. మీ ల్యాప్‌టాప్ బ్యాటరీలు ఎలా పని చేస్తున్నాయో అక్కడ తెలుసుకోవచ్చు. అలాగే ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌ని మెరుగుపరచడానికి మీరు ఏ బ్యాటరీ సెట్టింగ్స్ ఆప్షన్లను మార్చాలో కూడా తెలుసుకోవచ్చు.


హైబర్నేట్ మోడ్‌ను ఉపయోగించండి
బ్యాటరీని ఆదా చేయడానికి మీరు హైబర్నేట్ మోడ్ గురించి కూడా పూర్తి శ్రద్ధ వహించాలి. మీకు హైబర్నేట్ మోడ్‌ గురించి తెలియకుంటే మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ చివరి దశలో ఉన్నప్పుడు, షట్ డౌన్ అయిపోవడానికి ముందు మీ ల్యాప్‌టాప్‌ను హైబర్నేట్ మోడ్‌కి మార్చవలసి ఉంటుంది. ఈ పరిస్థితిలో మాత్రమే కాకుండా మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు లేదా మీరు దానిని తక్కువగా ఉపయోగిస్తున్నప్పుడు కూడా దీన్ని ట్రై చేయవచ్చు.


బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయండి
మీ ల్యాప్‌టాప్ బ్యాటరీని సేవ్ చేయాలనుకుంటే, ల్యాప్‌టాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న అన్ని యాప్‌లను కూడా క్లోజ్ చేయాలి. ఈ బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ చాలా బ్యాటరీని వినియోగిస్తాయి. దీన్ని ఆఫ్ చేయడం ద్వారా, బ్యాటరీ వినియోగం తగ్గుతుంది. మీ ల్యాప్‌టాప్ త్వరగా డిశ్చార్జ్ అవ్వదు.


బ్యాటరీ హెల్త్‌ని సరిగ్గా చూసుకోకపోతే దాన్ని వీలైనంత త్వరగా మార్చాల్సి వస్తుంది. అప్పుడు మనకే ధన రూపంలో నష్టం కలుగుతుంది. దీంతోపాటు పదేపదే ఛార్జింగ్ చేయాల్సి రావడం ప్రాసెసర్ మీద కూడా ప్రభావం చూపవచ్చు. అప్పుడు ఏకంగా మదర్ బోర్డు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి బ్యాటరీ దెబ్బ తినకుండా చూసుకోవడమే ఉత్తమం.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?