Balakrishna 109 Movie Updates : గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి (కె ఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు తెరకెక్కిస్తున్న చిత్రమిది. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. హీరోగా బాలకృష్ణ 109వ సినిమా ఇది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... 


సెట్స్ మీదకు NBK 109...
షూటింగ్ మొదలైందోచ్!
బాలకృష్ణ, బాబీ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. రాజకీయ నేపథ్యంలో మాంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సినిమా రూపొందుతోందని సమాచారం. ప్రస్తుతానికి వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్.


Also Read : విష్ణు మంచు 'కన్నప్ప'కు... 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' మధ్య కనెక్షన్ ఏంటి?






క్లీన్ షేవ్... గడ్డం తీసేసిన బాలకృష్ణ
విజయ దశమికి 'భగవంత్ కేసరి'తో థియేటర్లలోకి వచ్చారు బాలకృష్ణ. ఆ సినిమా మంచి విజయం సాధించింది. వసూళ్లతో పాటు ప్రశంసలు అందుకుంది. మీరు ఆ సినిమాలో బాలకృష్ణ లుక్ చూస్తే గడ్డం ఉంటుంది. సాల్ట్ అండ్ పెప్పర్ గడ్డం మైంటైన్ చేశారు. ఇప్పుడీ సినిమా కోసం లుక్ మార్చారు. క్లీన్ షేవ్ చేశారు.  


వయలెన్స్ కి విజిటింగ్ కార్డ్ బాలయ్య... 
మారణాయుధాలు... మందు... సిగరెట్!
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది జూన్ 10న పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. అప్పుడు ఓ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. గొడ్డలి, సుత్తి, కత్తి... ఒక్కటేమిటి? ఎన్‌బికె 109 కాన్సెప్ట్ పోస్టర్‌లో మారణాయుధాలు చాలా ఉన్నాయి. దానికి తోడు 'వయలెన్స్ కి విజిటింగ్ కార్డు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో డిఫరెంట్ యాక్షన్ సీన్లు తీయడానికి ప్లాన్ చేశారట. కత్తులతో పాటు ఆ సూట్ కేసులో మందు బాటిల్ కూడా ఉంది. అది మ్యాన్షన్ హౌస్ బాటిల్ కావడం విశేషం. అలాగే... సిగరెట్, డబ్బులకూ చోటు కల్పించారు. 


Also Read నా బాడీ వాడుకున్నారు, రష్మిక వీడియోతో నాకు సంబంధం లేదు - బ్రిటిష్ ఇండియన్ మోడల్ రియాక్షన్  
 
సంక్రాంతి బరిలో... ఈ ఏడాది జనవరిలో విడుదలైన తెలుగు సినిమాల్లో 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' ఉన్నాయి. మొదటి సినిమాలో హీరో బాలకృష్ణ కాగా... రెండో సినిమాకు బాబీ కొల్లి దర్శకుడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తుండటం విశేషం. బాలకృష్ణ మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని బాబీ మంచి కథ రెడీ చేశారట. 'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ చిరంజీవిని బాబీ ప్రజెంట్ చేసిన తీరు అభిమానులకు నచ్చింది. ఇప్పుడు బాలకృష్ణను సైతం అభిమానులు కోరుకునే విధంగా చూపించాలని డిసైడ్ అయ్యారట.