మనదేశంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలు గత రెండు సంవత్సరాల్లో ఎంతో దూసుకుపోయాయి. కరోనావైరస్ కారణంగా లాభపడిన వ్యాపారాల్లో ఇది కూడా ఒకటి. ఇంట్లోనే ఉంటూ వరల్డ్ సినిమాకు ఎక్స్‌పోజర్ రావడంతో ఎంతో మంది ఓటీటీ ప్లాట్‌ఫాంల వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫాంల్లో ఎక్స్‌క్లూజివ్ షోలు కూడా అందిస్తున్నారు.
అయితే ప్రస్తుతానికి మనదేశంలో డిస్నీప్లస్ హాట్‌స్టార్ నంబర్‌వన్ ఓటీటీ ప్లాట్‌ఫాంగా నిలిచాయి. జస్ట్‌వాచ్ అనే స్ట్రీమింగ్ గైడ్ సర్వీసు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ ప్లాట్‌ఫాంలపై పెర్ఫార్మెన్స్ రివ్యూని అందించింది. 2021 మూడో త్రైమాసికంలో కూడా డిస్నీప్లస్ హాట్‌స్టారే నంబర్‌వన్‌గా నిలిచింది. రెండో త్రైమాసికంలో పోలిస్తే రెండు శాతం అదనపు గ్రోత్‌ను కూడా హాట్‌స్టార్ సాధించింది.
కానీ హాట్‌స్టార్ మార్కెట్ షేర్ మాత్రం గత నెలతో పోలిస్తే ఒక శాతం పడిపోయింది. గత జనవరి నుంచి హాట్ స్టార్ మార్కెట్ షేరు ఐదు శాతం పెరిగింది. ఈ జాబితాలో హాట్‌స్టార్ తర్వాతి స్థానంలో అమెజాన్ ప్రైమ్ నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ మూడో స్థానంలో నిలవగా.. జీ5 నాలుగో స్థానంలో ఉంది.
వూట్ ఐదో స్థానాన్ని సంపాదించుకోగా.. సోనీలివ్, జియో సినిమా ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఆల్ట్ బాలాజీ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. హాట్ స్టార్ ఇటీవలే ఒరిజినల్ షోలు స్ట్రీమ్ చేయడంతో పాటు సినిమాలను కూడా అగ్రెసివ్‌గా కొనడం ప్రారంభించింది.
హమ్ దో హమారే దో, షిద్ధత్, క్రూయెల్లా, భుజ్ సినిమాలను హాట్‌స్టార్ స్ట్రీమ్ చేయడం మొదలు పెట్టింది. తెలుగులో కూడా నితిన్ నటించిన మాస్ట్రో సినిమాను హాట్‌స్టార్ స్ట్రీమ్ చేసింది. తేజ సజ్జ నటించిన అద్భుతం సినిమా నవంబర్ 19వ తేదీన హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. దీంతోపాటు వాండా విజన్, ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్, లోకి, వాట్ ఇఫ్? వంటి మార్వెల్ కంటెంట్ కూడా హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. బ్లాక్ విడో వంటి భారీ బడ్జెట్ సినిమాను కూడా నేరుగా హాట్‌స్టార్‌లో విడుదల చేశారు. దీంతో పాటు క్రికెట్ కంటెంట్ కూడా హాట్‌స్టార్ నంబర్ వన్ కావడానికి కారణం అయ్యాయి.
Also Read: నయనతార... వచ్చింది... నటించింది... గెలిచింది! - సమంత
Also Read: కోతులకు అరటిపళ్లు తినిపిస్తున్న సల్మాన్ ఖాన్, ఆయన మేనల్లుడు... వీడియో చూశారా?
Also Read: స్టాఫ్‌కూ ఫైవ్ స్టార్ హోటల్ డిమాండ్ చేసిన హీరోయిన్? అందుకే సినిమా నుంచి తప్పించారా? లేదంటే...
Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదన్నకోర్టు... హమ్మయ్య అనుకున్న హీరోయిన్ ఎంపీ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి