ఓ ఒరలో రెండు కత్తులు ఇమడలేవని సామెత. అలాగే, ఓ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఇమడలేరని... ఇద్దరూ స్నేహితులు కాలేరని ఇండస్ట్రీలో కొంత మంది అంటుంటారు. అయితే... అది తప్పని చాలా మంది నిరూపించారు. హీరోయిన్లలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. లేటెస్టుగా ఈ లిస్టులోకి నయనతార, సమంత చేరారు. విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా 'కాతువాకుళే రెండు కాదల్'లో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు (నవంబర్ 18, గురువారం) నయనతార పుట్టినరోజు. సినిమా సెట్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అందులో సమంత కూడా పాల్గొన్నారు. తర్వాత నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. అది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
"ఆమె వచ్చిందిఆమె చూసిందిఆమె ధైర్యం చేసిందిఆమె కలలు కన్నదిఆమె నటించిందిఆమె జయించింది(ప్రేక్షకుల హృదయాలను)హ్యాపీ బర్త్ డే నయన్... క్వీన్" అని సమంత ట్వీట్ చేశారు.
నయనతార, సమంత... ఇద్దరూ తెలుగుతో పాటు తమిళంలో స్టార్ స్టేటస్ అందుకున్నారు. రెండు భాషల్లో స్టార్ హీరోలతో నటించారు. అయితే... వాళ్లిద్దరూ ఇప్పటి వరకూ కలిసి నటించలేదు. 'కాతువాకుళే రెండు కాదల్'లో తొలిసారి వీరి కాంబినేషన్ కుదిరింది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.Also Read: స్టాఫ్‌కూ ఫైవ్ స్టార్ హోటల్ డిమాండ్ చేసిన హీరోయిన్? అందుకే సినిమా నుంచి తప్పించారా? లేదంటే...Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదన్నకోర్టు... హమ్మయ్య అనుకున్న హీరోయిన్ ఎంపీ !Also Read: మెగాస్టార్ చిరును పొగిడేసిన పవన్ భక్తుడు... ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో సినిమా వారికి యాభై శాతం ఫీజు తగ్గింపుRead Also: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!Read Also: ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్.. స్త్రీ ఎవడికీ దాసి కాదు.. ఆఖరికి ఆ దేవుడికి కూడా.. ఖబడ్దార్Also Read: అప్‌కమింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి