ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం... లైఫ్‌లో లిటిల్ మూమెంట్స్ క్యాప్చర్ చేయడం... హ్యాపీగా ఎంజాయ్ చేయడంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ముందుంటారు. లేటెస్టుగా ఈ రోజు (గురువారం) ఉదయం సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో కోతులకు అరటిపళ్లు తినిపిస్తూ కనిపించారు. సల్మాన్ ఖాన్ ఈ విధంగా చేయడంలో విశేషం ఏముంది? అనుకుంటున్నారా? ఆయనతో పాటు రెండేళ్లు కూడా నిండని మేనల్లుడు అయత్ కూడా నవ్వుతూ... కోతులకు అరటిపళ్లు తినిపించారు. సల్మాన్ సోదరి అర్పితా ఖాన్, హీరో ఆయుష్ శర్మ దంపతుల రెండో కుమారుడే అయత్. సల్మాన్ ఖాన్ పుట్టినరోజైన డిసెంబర్ 27న ఆ చిన్నోడు కూడా జన్మించాడు. ఇప్పుడే కాదు... గతంలోనూ మేనల్లుడితో సరదాగా గడిపిన క్షణాలను వీడియో తీసి సోషల్ మీడియా షేర్ చేశారు సల్మాన్. అవి అభిమానులు, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.



సల్మాన్ ఖాన్ సినిమాలకు వస్తే... బావా ఆయుష్ శర్మతో కలిసి నటించిన 'అంతిమ్: ద ఫైనల్ ట్రూత్' సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. అది కాకుండా అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో 'టైగర్ 3' సినిమా చేస్తున్నారు. అందులో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ మరోసారి కథానాయికగా కనిపించనున్నారు. సినిమాలు కాకుండా త్వరలో ప్రజల్లో కరోనాపై అవగాహనా పెంపొందించేలా... అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సల్మాన్ ఓ వీడియో రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.





మతపరమైన విశ్వాసాలతో కొంత మంది ముస్లింలు వ్యాక్సిన్ వేయించుకోవడం లేదని, అందువల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతోందని ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ తెలిపారు. సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్, మత గురువులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్లడించారు. సల్మాన్ ఖాన్‌తో కరోనా వ్యాక్సినేషన్ అవగాహనా కార్యక్రమం రూపొందించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

Also Read: ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్.. స్త్రీ ఎవడికీ దాసి కాదు.. ఆఖరికి ఆ దేవుడికి కూడా.. ఖబడ్దార్
Also Read: గ్రాండ్‌గా న‌య‌న్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌... అక్క‌డే స‌మంత కూడా!
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి