Youtube New Feature: యూట్యూబ్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందించింది. వినియోగదారులు తమ వాచ్ హిస్టరీని డిజేబుల్ చేస్తే యూట్యూబ్ రికమండేషన్లు కూడా ఆగిపోనున్నాయి. అంటే మీ యూట్యూబ్ మొబైల్ యాప్ హోం స్క్రీన్ ఖాళీగా ఉంటుందన్న మాట. ఈ ఫీచర్‌ను మెల్లగా రానున్న నెలల్లో యూట్యూబ్ విడుదల కానుంది. కానీ కొందరికి మాత్రం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.


ఈ అప్‌డేట్ వల్ల ఉపయోగం ఏంటి?
మనలో కొంత మందికి యూట్యూబ్ అల్గారిథం ఆటోమేటిక్‌గా ఇచ్చే సజెషన్స్ నచ్చవు. మనకు ఇంట్రస్ట్ లేనివన్నీ ఫీడ్‌లోకి వచ్చేస్తున్నాయని అనుకుంటూ ఉంటారు. ఈ కొత్త ఫీచర్ ఎనేబుల్ ద్వారా మీరు యూట్యూబ్ వాచ్ హిస్టరీ డిజేబుల్ చేసుకుంటే వీడియో రికమండేషన్లను యూట్యూబ్ నిలిపివేస్తుంది.


అంటే ఒక్కసారి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మీ యూట్యూబ్ హోం ఫీడ్ ఖాళీగా ఉండనుందన్న మాట. అయితే మీరు సబ్‌స్క్రిప్షన్స్ పేజీలోకి వెళ్లి మీరు సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఛానెల్స్ కంటెంట్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను మెల్లగా రానున్న నెలల్లో విడుదల చేయనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. 


ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియో రికమండేషన్లను నిలిపివేయాలనుకుంటే, యూట్యూబ్ వాచ్ హిస్టరీని నిలిపి వేయవచ్చు. ఒక్కసారి ఈ కొత్త అప్‌డేట్ మీ ఫోన్‌లోకి వచ్చినట్లయితే మీకు ఒక్క రికమండేషన్ కూడా క్లియర్ హోం పేజీ ఇలా కనిపిస్తుందన్న మాట.




యూట్యూబ్ వీడియో రికమండేషన్లను డిజేబుల్ చేయడం ఎలా?
1. ముందుగా యూట్యూబ్‌కు అటాచ్ అయిన గూగుల్ అకౌంట్‌లోకి సైన్ ఇన్ అవ్వాలి.
2. అక్కడ కనిపించే మూడు అడ్డగీతలపై క్లిక్ చేయాలి.
3. అందులో మీకు యూట్యూబ్ హిస్టరీ కనిపిస్తుంది.
4. అక్కడ ‘Turn off’ ఆప్షన్ ఎంచుకోవాలి.


ఈ ప్రక్రియ ద్వారా మీ యూట్యూబ్ హిస్టరీ డిజేబుల్ అవుతుంది. మీకు రికమండేషన్లుగా వచ్చే వీడియోల మీద మీకు పూర్తి కంట్రోల్ లభిస్తుందన్న మాట.


మరోవైపు యూట్యూబ్ షార్ట్స్ మరింత ప్రజాదరణ పొందేందుకు గూగుల్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.  సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే యూట్యూబ్ షార్ట్స్ ను టిక్ టాక్ మాదిరిగా మార్చనుందని తెలుస్తోంది. తాజాగా యూట్యూబ్ షార్ట్స్ ను చూడటంతో పాటు వాటిని రూపొందించే ప్రక్రియకు సంబంధించిన కొత్త ఫీచర్‌లను ప్రకటించింది. ఈ ఫీచర్లు ఇప్పటికే టిక్‌ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉన్నాయి.


ఈ ఫీచర్‌ను కొల్లాబ్ అని పిలవనున్నారు. ఇది టిక్‌ టాక్ డ్యూయెట్ ఫీచర్‌ తరహాలోనే ఉండనుంది. వీడియో ప్లే అయ్యేటప్పుడు ఒరిజినల్ వీడియో పక్కన స్ప్లిట్-స్క్రీన్ ఫార్మాట్‌ లో వీడియోకు రియాక్ట్ అయ్యేలా వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటికే యాపిల్ iOSలో క్రియేటర్‌లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికీ గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది.


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial