Android Settings You Must Change: మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుంటే ప్రైవసీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వీటన్నింటిలో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. వీటిని మీరు జాగ్రత్తగా ఆన్ లేదా ఆఫ్ చేయాలి. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరైనా మీ డేటాను యాక్సెస్ చేయవచ్చు. ఆ డేటాను దుర్వినియోగం చేయవచ్చు. ఇలాంటి 10 సెట్టింగ్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ 10 సెట్టింగ్స్ మన ప్రైవసీ, సెక్యూరిటీ, సేఫ్టీకి సంబంధించినవి
1. లాక్‌స్క్రీన్ నోటిఫికేషన్‌ల కంటెంట్‌ను ఎప్పుడూ హైడ్ చేసే ఉంచండి. మనమందరం లాక్‌స్క్రీన్‌లో ఫింగర్ ప్రింట్ లేదా పాస్‌కోడ్‌ని ఉపయోగిస్తాం. కానీ నోటిఫికేషన్ కంటెంట్‌ను హైడ్ చేయడం మర్చిపోతాము. దీంతో ఇతర వ్యక్తులు ఎవరైనా మీ డేటాను లేదా ముఖ్యమైన సందేశాన్ని చదవగలరు.
2. మన స్మార్ట్‌ఫోన్‌లో వివిధ అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసుకునే అనేక యాప్‌లు ఉన్నాయి. ఈ యాప్‌లను ఉపయోగించేటప్పుడు వాటికి అనేక రకాల అనుమతులు అవసరం. పని పూర్తయిన తర్వాత కూడా ఒక్కోసారి ఈ యాప్‌లు మన ఫోన్‌లోనే ఒక్కోసారి ఉంచుతాం. దీంతో పాటు పర్మిషన్లు ఆన్‌లో ఉన్నందున వారు డేటాను యాక్సెస్ చేస్తూ ఉంటారు. అందుకే అలాంటి యాప్స్ పర్మిషన్‌ను పాజ్ చేయడం మంచిది. మీరు యాప్ పర్మిషన్స్‌లో ఈ ఆప్షన్‌ను చూడవచ్చు.
3. మీరు మీ సౌలభ్యం ప్రకారం వివిధ భాషలలో యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. లాంగ్వేజ్‌ను మార్చుకోవడానికి మీరు యాప్ లాంగ్వేజ్‌కి వెళ్లి ఇక్కడ మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి.
4. మనమందరం పాస్‌వర్డ్స్, ఇతర ముఖ్యమైన సమాచారం కోసం ఆటో ఫిల్ ఆప్షన్‌ను ఉపయోగిస్తాం. కానీ మనం ఫింగర్ ప్రింట్ లాక్‌తో ఆటో ఫిల్‌ని బ్యాకప్ చేయం. ఆటో ఫిల్ సహాయంతో మన ఫోన్ ఎవరి వద్ద ఉందో వారు లాగిన్ వివరాలను యాక్సెస్ చేయవచ్చు. కాబట్టి ఫింగర్ ప్రింట్ లాక్‌తో ఆటో ఫిల్‌ని కొంచెం బ్యాకప్ చేయండి.
5. డ్రైవింగ్ మోడ్‌ను ఆన్‌లో ఉంచండి. తద్వారా మీరు కారు లేదా బైక్‌ను నడుపుతున్నప్పుడల్లా, ఫోన్ సైలెంట్‌లోకి వెళ్తుంది. దీని కారణంగా మీకు అంతరాయం కలగదు. ఈ సెట్టింగ్ ప్రయోజనం ఏమిటంటే ఇది ఫోన్ సెన్సార్‌లను ఉపయోగించి ఫోన్‌ను సైలెంట్ లేదా రింగ్ మోడ్‌లో ఉంచుతుంది. మీరు దీన్ని మళ్లీ మళ్లీ ఆన్, ఆఫ్ చేయవలసిన అవసరం లేదు.
6. యాప్స్‌కు సంబంధించిన అనవసర నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి. తద్వారా మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. యాప్స్ నోటిఫికేషన్ ఆప్షన్‌లోకి వెళ్లడం ద్వారా మీరు ఈ పనిని చేయవచ్చు. ఉదాహరణకు బ్యాంకుకు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌లను ఆన్‌లో ఉంచండి. స్విగ్గీ మొదలైన వాటికి సంబంధించిన ప్రమోషనల్ అప్‌డేట్స్‌ను ఆపివేయండి.
7. ఈ రోజుల్లో యాప్‌లో కొనుగోళ్లు సర్వసాధారణం. అందువల్ల పేమెంట్‌ను వెరిఫై చేయడానికి బయోమెట్రిక్‌ను ఆన్‌లో ఉంచండి. తద్వారా ఏదైనా పేమెంట్ చేసినా, అది మీ అనుమతితోనే అవుతుంది. ఈ సెట్టింగ్‌ని ఆన్ చేయడానికి గూగుల్ సెట్టింగ్స్‌కు వెళ్లండి.
8. థర్డ్ పార్టీ యాప్‌లకు ఇచ్చిన యాక్సెస్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. మీరు ఏ యాప్‌ను ఉపయోగించకుంటే, దానికి సంబంధించిన యాక్సెస్‌ని తీసివేయండి. తద్వారా మీ డేటా సురక్షితంగా ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేయడానికి గూగుల్ అకౌంట్‌లోని డేటా, ప్రైవసీ ఆప్షన్‌కు వెళ్లండి.
9. కస్టమైజ్డ్ యాడ్స్: మనం మన ఫ్రెండ్స్‌తో ఏదైనా ప్రొడక్ట్ లేదా షాప్ గురించి మాట్లాడినా, లేకపోతే ఆఫ్‌లైన్‌లో ఏదైనా ప్రదేశంలోకి వెళ్లినప్పుడు అక్కడి షాప్‌లకు సంబంధించిన యాడ్స్ రావడం మనందరికీ చాలా సార్లు జరుగుతుంది. ఇది జరగకుండా నిరోధించడానికి లొకేషన్ సర్వీసును నిలిపివేయండి. యాప్స్ యాక్టివిటీని కూడా సేవ్ చేయకుండా అన్‌చెక్ చేయండి. మీరు మీ గూగుల్ ఖాతాలో ఈ రెండు ఆప్షన్లను చూడవచ్చు.
10. మీ మొబైల్‌లో స్మార్ట్ ఛార్జింగ్ లేదా అడాప్టివ్ ఛార్జింగ్ ఆప్షన్‌ను ఆన్‌లో ఉంచుకోవచ్చు. దీని వల్ల మీ బ్యాటరీ హెల్త్ బాగుంటుంది. మీ ఫోన్ ఒక పద్ధతి ప్రకారం ఛార్జ్ చేయబడుతుంది.
Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial