BSNL Rs 999 Broadband Plan: మీరు అందుబాటులో ధరలో భారీ మొత్తంలో డేటా, అపరిమిత కాలింగ్, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సభ్యత్వం కోసం చూస్తున్నట్లయితే బీఎస్ఎన్ఎల్ మీ బెంగను తీరుస్తుంది. ప్రభుత్వ టెలికాం కంపెనీ కస్టమర్లు 2 టీబీ హై స్పీడ్ డేటా, ఉచిత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను పొందే ప్లాన్‌ను అందిస్తుంది. అంటే ఇప్పుడు మీరు వినోదం గురించి లేదా ఆన్‌లైన్‌లో మీకు కావాల్సిన కంటెంట్ చూసే సమయంలో డేటా అయిపోవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.


బీఎస్ఎన్ఎల్ సూపర్‌స్టార్ ప్రీమియం ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో 150 ఎంబీపీఎస్ హై స్పీడ్‌తో 2000 జీబీ డేటాను అందిస్తుంది. ఈ మొత్తం డేటాను ఉపయోగించినా భయపడాల్సిన అవసరం లేదు. దీని తర్వాత కూడా ఇంటర్నెట్ పని చేస్తూనే ఉంటుంది. అయితే వేగం 10 ఎంబీపీఎస్‌కి తగ్గుతుంది. ఇది కాకుండా వినియోగదారులు అన్‌లిమిటెడ్ డౌన్‌లోడ్‌లను కూడా పొందగలుగుతారు. ఇది మాత్రమే కాదు. ఈ ప్లాన్ కింద కస్టమర్‌లు ఫిక్స్‌డ్ లైన్ కనెక్షన్ నుంచి అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా పొందుతారు. 



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


లాంగ్ ప్లాన్‌లతో డిస్కౌంట్లు కూడా...
ఈ ప్లాన్ కోసం కస్టమర్లు నెలకు రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఒక సంవత్సరం ప్లాన్‌ని కొనుగోలు చేస్తే దానితో మీకు ఒక నెల ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. రెండేళ్ల ప్లాన్‌పై మూడు నెలలు, మూడు సంవత్సరాల ప్లాన్‌పై నాలుగు నెలల ప్లాన్‌ను ఉచితంగా పొందవచ్చు. అంటే మీరు 36 నెలల సబ్‌స్క్రిప్షన్ చెల్లిస్తే మీరు 40 నెలల పాటు ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు.


ఈ ప్లాన్‌లో కంపెనీ ఎనిమిది ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ఉచిత సభ్యత్వాన్ని అందిస్తోంది. వీటిలో డిస్నీప్లస్ హాట్‌స్టార్, లయన్స్‌గేట్, షెమారూ మీ, హంగామా, సోనీ లివ్ ప్రీమియం, జీ5 ప్రీమియం మొదలైన బెస్ట్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఒకే ప్లాన్‌లో బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు కాలింగ్, డేటా, వినోద సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ ప్లాన్‌ని పొందడానికి బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?