Jagan promised that the activists will be treated with respect :  అసంతృప్తిలో ఉన్న పార్టీ కార్యకర్తలను బుజ్జగించేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం.ఇకపై మరోలా చూస్తామన్నారు. వారిని గొప్పగా చూస్తాం.ఈ విషయంలో మనంకూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. వైయస్సార్సీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని భరోసా ఇస్తున్నామన్నారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వారిని చట్టంముందు కచ్చితంగా నిలబెడతాం. ఎందుకంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. వీళ్లే కొడుతున్నారు, మరలా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఒక మనిషిని పదిచోట్ల తిప్పుతున్నారు. ఇవన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నాయి. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.  
 
ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు. కానీ కేవలం ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు.  చంద్రబాబులా హామీలు ఇవ్వాలని నాతో చెప్పారు.  కానీ ఆ రోజు మనం అబద్దాలు చెప్పలేదు. కారణం రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయ ఉండాలి. అలాంటి వారికే విలువ ఉంటుందన్నారు. ఒక నాయకుడిగా మనం ఒక మాటచెప్పినప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారు.ఆ మాట నిబెట్టుకున్నామా? లేదా? అని చూస్తారు. ఆ మాట అమలు కాకపోతే.. ఆ నాయకుడి విలువ పోతుంది. అందుకనే మనం అబద్ధాలు చెప్పలేకపోయామన్నారు. చంద్రబాబు హామీల అమలు చేయాలంటే రూ.1.72లక్షలకోట్లు ఇవ్వాలి అని చెప్పాను. ఇది అయ్యే పని కాదు ఆయన చెప్పినవన్నీ మోసాలు, అబద్దాలు అని చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పాను. ఆయన్ను నమ్మడమంటే.. పులినోట్లో తలకాయపెట్టడమే అని చెప్పాను. ఇవాళ  ఆ వీడియోలు చూస్తే.. జగన్‌ కరెక్టుగానే చెప్పాడనుకునే పరిస్థితి కనిపిస్తోందన్నారు. 


జగన్ ఉన్నప్పుడు పలావు పెట్టాడు.ఇప్పుడు చంద్రబాబు పెడతానన్న బిర్యానీ పోయింది. జగన్‌ పెడుతున్న పలావూ పోయింది. చంద్రబాబుకూ, జగన్‌కూ మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. మన ప్రభుత్వంలో ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్‌డెలివరీ జరిగేది. మరి చంద్రబాబుకాలంలో ఎందుకు ఇలా జరగడంలేదు?. తేడా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది.  చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ గాలికెగిరిపోయాయి. ఇవాళ ప్రతి ఇంట్లో ఒక్కటే చర్చ.. ఎనిమిది నెలలు అయింది, సంక్రాంతి వచ్చింది. ఇప్పుడు వైయస్పార్సీపీ‌ ప్రభుత్వం ఉండిఉంటే.. ప్రతినెలా ఏదో పథకం వచ్చేదన్నారు.  


పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా పార్టీ నిర్మాణం ఉంది. దీన్ని వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దాలి. ఈ సంక్రాంతి నాటికి పార్టీ జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల ఏర్పాట్లన్నీ కూడా పూర్తికావాలి. నేను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యనటకు వస్తాను. అక్కడే నిద్ర చేస్తాను.ప్రతి వారం మూడు రోజులు మంగళ,బుధ, గురువారాల్లో ఒక పార్లమెంటులో విడిదిచేస్తాను. ప్రతిరోజూ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటాను. మండలస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ పార్టీ బలోపేతం కావాలి.గ్రామస్థాయి కమిటీలు, బూత్‌ కమిటీలు ఇవన్నీకూడా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.