భారత్ స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తక్కువ ధరతో చక్కటి స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి తయారీ కంపెనీలు. భారత మార్కెట్లో ఈ నెల(మే 2023లో)లో నాలుగు స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు బాగా ఆకర్షిస్తున్నాయి. రూ. 25 వేలలోపు ధరలతో అత్యుత్తమ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వివిధ ఆన్‌లైన్ విక్రయ సంస్థలు సమ్మర్ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. కాబట్టి, ఈ ఫోన్లలో కొన్ని తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.


1.OnePlus Nord CE 3 Lite 5G


OnePlus Nord CE 3 Lite ఇటీవలే భారతీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ OnePlus లైనప్‌లో అత్యంత సరసమైన హ్యాండ్ సెట్. 8GB RAM,  128GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర రూ. 19,999 కాగా, హై-ఎండ్ 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.21,999.  నోర్డ్ CE 3 లైట్ చక్కటి డిజైన్‌ను కలిగి ఉంది.  లైమ్ కలర్ తో ఆకట్టుకుంటుంది. సరికొత్త 108MP ప్రైమరీ రియర్ కెమెరా, 120Hz IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీతో వస్తోంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. Nord CE 3 Lite  OxygenOS 13.1తో రన్ అవుతుంది.


2. Poco X5 Pro 5G


Poco X5 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకు ఈ కంపెనీ నుంచి వచ్చిన బెస్ట్ ఫోన్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ 108MP ప్రైమరీ రియర్ కెమెరాను కలిగింది.  Poco X5 Pro 5G స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా రన్ అవుతుంది. ఆప్టిమైజ్ చేయబడిన చిప్ ను కలిగి ఉంటుంది.  డాల్బీ విజన్ సపోర్ట్‌ తో కూడిన 120Hz HDR 10+ డిస్‌ప్లేతో వస్తోంది.  లౌడ్,  క్రిస్ప్ స్టీరియో స్పీకర్లు చక్కటి మ్యూజిక్ ను అందిస్తాయి. డస్ట్ రిస్ట్రిక్షన్ కోసం IP53 రేటింగ్ ను కలిగి ఉంటుంది. 5,000mAh బ్యాటరీతో పాటు 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. Poco X5 Pro 5G  రూ. 25,000 కంటే తక్కువ ధరతో టాప్ ఫీచర్లతో అందుబాటులో ఉంది.  


3. Realme 10 Pro+ 5G


Realme 10 Pro+ 5G 108MP ప్రైమరీ  కెమెరాను కలిగి ఉన్న మరొక బెస్ట్ స్మార్ట్‌ ఫోన్. రూ. 25,000 లోపు అత్యుత్తమ ఫోన్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. Realme 10 Pro+  120Hz  రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది.  AMOLED డిస్‌ ప్లేతో వస్తుంది.  Realme 10 Pro+  డైమెన్సిటీ 1080 SoCతో పాటు 8GB వరకు RAM,  256 GB ఇన్ బిల్ట్ మెమరీతో వస్తుంది.    5,000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది.  


4. iQOO Z6 Pro 5G


ఇది గేమింగ్‌ ను ఇష్టపడే వారికి చాలా అనుకూలమైన ఫోన్ గా చెప్పుకోవచ్చు. HDR10+ ప్లేబ్యాక్ సపోర్ట్‌ తో కూడిన  120Hz AMOLED డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. 4,700mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ తో వస్తుంది.  స్నాప్‌డ్రాగన్ 778G SoCని కలిగి ఉంటుంది. రూ. 25 వేల లోపు బెస్ట్ ఫోన్లలో ఇదీ ఒకటిగా చెప్పుకోవచ్చు.


Read Also: సూపర్ డూపర్ ఫీచర్లతో గూగుల్ Pixel 7a స్మార్ట్ ఫోన్, భారత్ లో లాంచింగ్ ఎప్పుడంటే?