Aishwarya Rajesh : నటి ఐశ్వర్య రాజేష్ ఇటీవల 'స్పప్న సుందరి' అనే డార్క్ కామెడీ డ్రామాలో కనిపించింది. ఈ సినిమా ఏప్రిల్ 14, 2023న విడుదలైంది. SG చార్లెస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. పాజిటీవ్ రివ్యూలను సొంతం చేసుకున్నఈ చిత్రం ఇప్పుడు OTTలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఐశ్వర్య రాజేష్.. తమిళ చిత్రం ‘స్వప్న సుందరి’తో ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ద్వారా తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ భిన్న పాత్రలో నటించి, ప్రేక్షకులను మెప్పించారు. ఆమెతో పాటు ఈ సినిమాలో లక్ష్మీప్రియ, చంద్రమౌళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమాను హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్, హ్యూబాక్స్ స్టూడియోస్, అహింస ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ పై మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ ఫేమస్ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మే 12, 2023 నుంచి ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా మేకర్స్ షేర్ చేశారు.
ఇక ఐశ్వర్య రాజేష్ విషయానికొస్తే.. తమిళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతే కాకుండా ది బెస్ట్ ఫర్మార్మెన్స్ ఇచ్చే హీరోయిన్ల లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు లో 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్.. ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజేష్ కుమార్తె. అంతే కాదు హాస్య నటి శ్రీ లక్ష్మి మేనకోడలు. ఆమె తన చిన్నతనం లోనే తండ్రి చనిపోవడంతో ఐశ్వర్య ఎన్నో కష్టాలు పడ్డారు. ఒకానొక సందర్భంలో ఆమె ఓ కంపెనీ లో రూ. 7 వేల జాబ్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
టెలివిజన్ వ్యాఖ్యాతగా అసత పోవతు ఎవరు అనే కామెడీ షోలో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య.. ‘మానాడ మయిలాడ’ అనే రియాలిటీ షోలో విజేతగా నిలిచారు. ఆ తర్వాతే 'వరల్డ్ ఫేమస్ లవర్', 'టక్ జగదీష్' సినిమాలతో ఐశ్వర్య రాజేష్ అలరించారు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి, మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. 2019లో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె.. 2018లో వచ్చిన 'కనా' రిమేక్ 'కౌసల్య కృష్ణమూర్తి'లో నటించారు. సినిమాల్లో నటించడంతో పాటు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో 2014 చిత్రం 'కాకా ముట్టై'లో ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును దక్కించుకున్నారు.
Also Read : డివోర్స్ ఫోటోషూట్‌తో వైరల్ అయిన నటికి కొత్త సమస్య? - భర్త ఒక్కడే కాదు, ఇంకా 99!