Bajrang Dal Ban:


అన్ని ఆలయాల్లో చాలీసా పఠనం..


భజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ హామీపై బీజేపీ ఇప్పటికే కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది కాషాయ పార్టీ. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఆలయంలో హనుమాన్ చాలీసా చదవనున్నట్టు ప్రకటించింది. రేపు (మే 4వ తేదీ) సాయంత్రం 7 గంటలకు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ బీజేపీ కార్యకర్తలు హనుమాన్ చాలీసా చదవనున్నారు. గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ చాలీసా చదివేందుకు ప్లాన్ చేసుకుంటోంది ఆ పార్టీ. భజ్‌రంగ్ దళ్ బ్యాన్‌ హామీ పూర్తి స్థాయిలో పొలిటికల్‌గా వాడుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే హనుమాన్ చాలీసా అంశం తెరపైకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో కాంగ్రెస్‌కి యాంటీ హిందూ అనే ముద్ర పడేలా వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్ ఈ వివాదంపై స్పందించలేదు. కాంగ్రెస్ ఎలాంటి కౌంటర్ అటాక్‌తో ముందుకొస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అటు ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రతి సభలోనూ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు. భజ్‌రంగ్ దళ్ బ్యాన్‌ హామీపై నేరుగా స్పందించకపోయినా...తన ప్రసంగాన్ని భజ్‌రంగ్ బలి కీ జై అంటూ స్టార్ట్ చేశారు. అలా కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.