పిల్ కంపెనీ తాజాగా సెకెండ్ జెనెరేషన్ Apple Watch SEని పరిచయం చేసింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన పార్ అవుట్ ఈవెంట్ లో ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. ఈ కొత్త Apple Watch SE 2 ఫ్లాగ్‌ షిప్ Apple Watch Series 8లో భాగంగా వినియోగదారుల ముందుకు వచ్చింది.  కొత్త Apple Watch SEకి సంబంధించి GPS, సెల్యులార్ మోడల్‌ ధరను రూ. 29,899గా కంపెనీ నిర్ణయించింది. అయితే, తక్కువ ధరకు ఈ స్మార్ వాచ్ ను కొనుగోలు చేయాలి అనుకునే వారికి అమెజాన్ అదిరిపోయే అవకాశం కల్పిస్తోంది.  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్- 2022లో భాగంగా.. గతేడాది Apple Watch SE  ఉంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్‌లతో పాటు అతి తక్కువ ధరకు దీన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ డీల్ గురించి మరిన్ని వివరాలు మీకోసం.. 


Amazonలో Apple Watch SE ధర


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 ఆపిల్ వాచ్ SE 40mm GPS + సెల్యులార్ మోడల్ ధరను  రూ. 24,900 నుంచి భారీగా తగ్గించింది. ఈ స్మార్ట్ వాచ్ ను వినియోగదారులు మూడు రంగులలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. సిల్వర్, గోల్డ్ తో పాటు స్పేస్ గ్రే - అబిస్ బ్లూలో వీటిని అందుకోవచ్చు. ఈ వాచ్ కొనుగోలు సమయంలో  10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంది. EMI యేతర లావాదేవీల కోసం SBI క్రెడిట్ కార్డ్‌పై రూ. 1250 తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా ఎక్స్ఛేంజ్ డీల్ రూ. 14250కు చేరుతుంది. అయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. Apple Watch SEలో ఈ భారీ తగ్గింపును పొందడానికి మీరు మీ పాత స్మార్ట్‌ ఫోన్ లేదంటే టాబ్లెట్‌ లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. మొత్తంగా ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్ కలిపి  మీరు Apple Watch SE 40mmని కేవలం రూ. 9400కే దక్కించుకునే అవకాశం ఉంది. ఈ ధర తగ్గింపు ఒప్పందం అవసరమైన షరతులను నెరవేర్చిన తర్వాత మాత్రమే వర్తిస్తుందని గుర్తించాలి.


18 గంటల బ్యాటరీ బ్యాకప్


కొత్త Apple Watch SE 2 తో పాటు ఫస్ట్ జనెరేషన్ మోడల్ దాదాపు ఒకే డిజైన్‌ ను కలిగి ఉంటాయి.  1.57-అంగుళాల రెటినా LTPO OLED ప్యానెల్‌ ను పొంది ఉంటుంది. Apple వాచ్ SE S5 చిప్‌ ను కలిగి ఉంటుంది. సుమారు 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇచ్చే 245mAh బ్యాటరీతో ప్యాక్ చేసి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్మార్ట్ వాచ్ గా Apple Watch SE 2 కొనసాగుతోంది.


Also Read: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? వెంటనే ఇలా ట్రాక్ చేసి, ఎక్కడుందో తెలుసుకోండి
Also Read: మీ వాట్సాప్ చాట్ ను ఎవరికీ కనిపించకుండా దాచుకోవచ్చు, ఎలాగో తెలుసా!?