జానకి స్పృహలోకి వచ్చి మళ్ళీ అలా అవడం ఏంటి అని రామూర్తి బాధపడుతూ ఉంటాడు. ఆ ఇల్లు కట్టి ఎన్నో సంవత్సరాలు అయ్యింది ఎప్పుడు కింద పడింది లేదు ఇప్పుడు ఇలా జరగడం ఏంటి అని అంటాడు. దేవి, చిన్మయి ఏడుస్తూ వచ్చి అవ్వకి ఎలా ఉందని అడుగుతారు. ఏం లేదు అంతా మంచిగ అవుతుందని డాక్టర్ చెప్పారు అని రాధ వాళ్ళకి చెప్తుంది. రాధకి దేవుడమ్మ ఫోన్ చేస్తుంది. దేవి లిఫ్ట్ చేసి ఏడుస్తూ ఉంటుంది. అవ్వా మా అవ్వ మెట్ల మీద నుంచి కిందపడింది అని చెప్తుంది. ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడుగుతుంది. నేను మీ ఆఫీసర్ సారుని తీసుకుని ఇప్పుడే వస్తున్నా అని దేవుడమ్మ చెప్తుంది. దేవుడమ్మ ఆదిత్యని పిలిచి వెంటనే హాస్పిటల్ కి వెళ్దాం పద అని అంటుంది. అక్కడ రుక్మిణి ఉంటుంది అమ్మ చూస్తే ఎలా అని ఆదిత్య టెన్షన్ పడతాడు.


ఆదిత్య రుక్మిణికి ఫోన్ చేసి విషయం చెప్దామని ఫోన్ చేస్తాడు కానీ కలవదు. ఇద్దరు హాస్పిటల్లోకి రావడం చిన్మయి గమనిస్తుంది. ఆదిత్య దేవుడమ్మని ఆపేందుకు చూస్తాడు కానీ తను వినదు. వాళ్ళని చూసిన చిన్మయి వెంటనే రాధకి చెప్తుంది. అప్పుడు రుక్మిణి కూడా వాళ్ళని చూసి ఇద్దరు కనిపించకుండా పక్కకి వెళ్లిపోతారు. దేవుడమ్మ, ఆదిత్య రామూర్తి వాళ్ళ దగ్గరకి వస్తారు. దేవి చిన్మయి, తన తల్లి కోసం వెతుకుతూ పక్కకి వెళ్ళిపోతుంది. రామూర్తిని వచ్చి పలకరిస్తుంది. మీరు అలా అధైర్యపడకండి ఆమె పూర్తి ఆరోగ్యంతో బయటకి వస్తారు, అయిన హఠాత్తుగా అలా ఎలా జరిగిందని అడుగుతుంది.


Also Read: వేద ప్లాన్ తెలుసుకున్న యష్- శర్మ దగ్గర సులోచనని ఇరికించిన మాలిని


ఆదిత్యని ఎలాగైనా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోవాలి. ఇక్కడ ఉన్న దగ్గర నుంచి నా గురించి ఆలోచించడం లేదు. దేవి గురించి బయట వాళ్ళ గురించి ఆలోచించడం ఎక్కువైపోయింది. మాకంటూ బిడ్డ కావాలనే ఆలోచన లేకుండా పోయింది. అది తన తప్పు కాదు చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల. అందుకే ఆదిత్యని ఇక్కడ నుంచి తీసుకెళ్లాలి. ఈసారి తను రాను అంటే నేను ఒక్కదాన్ని అయినా వెళ్లిపోవాలి. ఒంటరిగా అయినా నేను అమెరికా వెళ్ళి సమస్య తీర్చుకోవాలి. అప్పుడే ఆదిత్య మనసు అక్క మీద, దేవి మీదకి వెళ్ళకుండా ఉంటుందని సత్య నిర్ణయించుకుంటుంది. ఏదో జరుగుతుందని అనుకుంటే ఇలా జరుగుతుంది ఏంటి ఇప్పుడు అమ్మ కళ్ళు తెరిచి నిజం చెప్తే నా ప్లాన్ అంతా పాడవుతుంది. రాధ నాకు దూరం అవుతుంది. అలా జరగడానికి వీల్లేదని మాధవ్ అనుకుంటాడు.


ప్రాణం పోయినా సరే రాధని నా సొంతం చేసుకోకుండా వదలను. ఉదయం వరకు అమ్మ నాకు కనిపించకుండా వెళ్ళి ఉంటే ఈపాటికి రాధ నా భార్య అయిపోయి ఉండేది. ఇప్పుడు అమ్మకి రాధ ఎవరు అనే విషయం తెలిసిపోయింది. కళ్ళు తెరవగానే రాధ ఎవరు అని నా గురించి అందరికీ చెప్పేస్తుంది. అదే జరిగితే నా పరిస్థితి ఏంటి అని మాధవ ఆలోచిస్తాడు. అందరూ జానకి దగ్గరకి వెళతారు. మెట్ల మీద నుంచి పడటం వల్ల నరాలు బాగా ఒత్తిడికి గురై పక్షవాటం వచ్చిందని డాక్టర్ చెప్తాడు. అది విని అందరూ షాక్ అవుతారు. మాధవ్ మాత్రం నవ్వుతూ ఉంటాడు. ఆమె ఇప్పట్లో నడవటం కష్టమని చెప్తారు.


Also Read: కిచెన్లో రిషిధార - కళాశాల నుంచి వంటింటికి చేరిన ప్రేమకథ