వేద యష్ కి నచ్చావు అని చెప్తుంది. ఆ విషయాన్ని యష్ వెటకారంగా తీసుకుంటాడు. మళ్ళీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలాగా పోట్లాడుకుంటారు. ఫస్ట్ టైమ్ నచ్చారు అన్నావ్ మన అగ్రిమెంట్ క్రాస్ చేస్తున్నావేమో ఆలోచించుకో అని యష్ అనేసరికి అంతలేదు మనం పెళ్లి చేసుకుంది కేవలం ఖుషి కోసమే అని ఇద్దరు అనుకుంటారు. యష్ వేద మెడలో తాళి కట్టిన విషయాలు తనతో గడిపిన క్షణాలు అన్నీ ఇద్దరు గుర్తు చేసుకుంటారు. యష్ వేదకి ఐ లవ్యూ చెప్పడం, వేద ఐ మిస్ యు చెప్పడం అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.


రత్నం దగ్గరకి మాలిని వచ్చి పలకరించేందుకు చూస్తుంది. కానీ రత్నం మాత్రం సులోచన మాటలు నమ్మి మోహన్ కి మాలినికి పాత రోజుల్లో లవ్ ఎఫైర్ ఉందనే విషయం చెప్తాడు. అలాంటిది ఏమి లేదని మాలిని చెప్పినా కూడా రత్నం వినిపించుకోకుండా బాధగా వెళ్ళిపోతాడు. ఇదంతా ఆ సులోచన పనే ఉండు దాని సంగతి చెప్తా అని మాలిని అనుకుంటుంది. తర్వాత సులోచన ఇంటికి ఒక బొకే వస్తుంది. అది శర్మ తీసుకుని వస్తాడు. అది చూసిన సులోచన ఎవరు పంపించారు ఇది పూలు చాలా బాగున్నాయి నాకు ఇష్టమైన పూలు ఇవి అని మురిసిపోతూ ఉంటే అందులో నుంచి ఒక లెటర్ కింద పడిపోతుంది. అది శర్మ చదువుతాడు. అగ్రహారంలోని గోడల మీద మన పేర్లు ఉండటం అన్నీ నీకు గుర్తు ఉన్నాయా? నిన్ను మరచిపోవడం కన్న చచ్చిపోవడం సులువు. నీకు కుటుంబం ఉందేమో కానీ నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు ఇట్లు నీ అమరప్రేమికుడు అని ఆ లెటర్లో రాసి ఉంటుంది.


Also Read: కిచెన్లో రిషిధార - కళాశాల నుంచి వంటింటికి చేరిన ప్రేమకథ


ఇన్ని రోజులు నీ అగ్రహారం ప్రేకమకథ నాకు ఎందుకు చెప్పలేదు సులోచన అని శర్మ కోపంగా అంటాడు. నాకు అటువంటిది ఏమి తెలియదండి అని సులోచన చెప్పినా కూడా శర్మ వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అది చూసి మాలిని సంతోషిస్తుంది. ఈ మలబార్ మాలినిని ఇరికించాలని చూస్తావా, ఎప్పుడు లేనిది మా రత్నం నన్ను డౌట్ పడేలా చేస్తావా? నేను పంపించిన ఈ గిఫ్ట్ తో ఇక నీ లైఫ్ కుక్కర్ లాగే ఇది టిట్ ఫర్ టాట్ అని మాలిని అంటుంది. చిత్ర వసంత్ గురించి ఇంట్లో వాళ్ళ ముందు చెప్పి ఆవేదన చెందుతుంది. నిధితో ఎంగేజ్మెంట్ కి రెడీ అయిపోయాడు ఇక్కడ మాత్రం నువ్వు నన్ను బుజ్జగిస్తున్నావ్ అని అరుస్తుంది. ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చిత్రకి ధైర్యం చెప్పేందుకు చూస్తారు.


వైభవ్ తో నీ నిశ్చితార్థం అంతా ఉత్తుత్తె కదా మనం ఏమైనా ఫంక్షన్ హాల్ బుక్ చేశామా పంతుల్ని పిలిచామా అని వేద చిత్రతో అనడం ఖుషి విని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్లాన్ ఆలోచిద్దాం వసంత్ మనసు మార్చే ప్లాన్ మరొకటి ఆలోచిద్దాం అని వేద అంటుంది. వెంటనే ఖుషి వెళ్ళి ఉత్తుత్తి నిశ్చితార్థం అంటే ఏంటి అని మాలినిని అడుగుతుంది. అలా అడగటం యష్ కూడా వింటాడు. ఎవరు చెప్పారు అని మాలిని అంటే అమ్మమ్మ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేయలేదంట అని ఖుషి చెప్తుంది.


Also Read: డాక్టర్ బాబుకి గతం గుర్తుచేసేందుకు దీప సరికొత్త సాహసం, కార్తీక్ లో మార్పు చూసి మురిసిపోయిన మోనిత


చూశావా యష్ వీళ్ళ మీద నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. మన వసంత్ మనసు మార్చి ఆ చిత్రని ఇచ్చి కట్టబెట్టడానికి ఈ ఎంగేజ్మెంట్ డ్రామా ఆడుతున్నారు అని మాలిని అంటుంది. డ్రామా ప్లే చేయడం మనకి కూడా తెలుసు వాళ్ళకి మన మలబార్ తెలివితేటలు ఏంటో చూపిద్దాం అని యష్ అంటాడు. మిసెస్ న్యూసెన్స్ వి యూర్ కమింగ్ అని యష్ అంటాడు.