ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp)ను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. బంధు మిత్రులు,  ఆఫీస్ సిబ్బందితో పాటు తెలిసిన వారితో నిత్యం ఆయా అవసరాల కోసం మెసేజ్ చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని అత్యంత ముఖ్యమైన చాటింగ్స్ ఉంటాయి. వాటిని ఎవరికీ కనిపించకుండా దాచుకోవాలి అనుకుంటారు. కానీ, వాట్సాప్ లో చాట్ హైడ్(Chat Hide) చేసే ఆప్షన్ ప్రత్యేకంగా లేదు. కానీ, ఇందుకోసం ఆర్కైవ్ (Archive) చాట్ ఫీచర్‌ ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌ సాయంతో మీ వ్యక్తిగత, లేదంటే గ్రూప్ చాట్స్‌ ను  దాచుకోవచ్చు.


చాట్‌ను ఆర్కైవ్ చేయడం మూలంగా చాట్‌ డిలీట్ కాదు. ఈ చాట్ మెసేజెస్ మొత్తం మీ వాట్సాప్ లోనే స్టోర్ అవుతాయి. ఆర్కైవ్‌ చేసిన చాట్స్ నుంచి కొత్త మెసేజ్ వచ్చినప్పుడు సైతం నోటిఫికేషన్ రాదు. కొత్తగా ఎన్ని మెసేజ్‌లు వచ్చినా ఆర్కైవ్డ్ లిస్టులోనే ఉంటాయి. మెయిన్ చాట్ లిస్ట్ పేజీలో కూడా కనిపించవు. ఆర్కైవ్డ్ గ్రూప్ చాట్‌లో మిమ్మల్ని మెన్షన్ చేసినా లేదా మీ మెసేజ్‌కి రిప్లై ఇచ్చినా నోటిఫికేషన్‌ వస్తుంది. ఈ రెండు సందర్భాల్లో తప్ప మిగతా ఈ సందర్భంలోనూ నోటిఫికేషన్లు రావు.  ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ చాట్ హైడ్ కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఐఫోన్లో వాట్సాప్ చాట్స్ను ఇలా దాచుకోవచ్చు


⦿ మీ చాట్‌ను ఆర్కైవ్ చేయడానికి చాట్స్ ట్యాబ్‌లో మీరు ఆర్కైవ్ చేయాలనుకుంటున్న చాట్ లేదా గ్రూప్‌పై ఎడమవైపుకు స్వైప్ చేయండి. ఆపై ఆర్కైవ్ నొక్కండి. మీరు వాట్సాప్ సెట్టింగ్స్> చాట్స్> ఆర్కైవ్ ఆల్ చాట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి అన్ని చాట్‌లను ఒకేసారి ఆర్కైవ్ చేయవచ్చు.


⦿ ఆర్కైవ్డ్ చాట్స్ చూడటానికి చాట్స్ ట్యాబ్ పైకి స్క్రోల్ చేయండి. ఆర్కైవ్డ్ పై నొక్కండి.


ఆండ్రాయిడ్ఫోన్ లో వాట్సాప్ చాట్స్ను ఇలా దాచుకోవచ్చు


⦿ చాట్స్ ట్యాబ్‌లో  ఇండివిడ్యువల్ లేదంటే  గ్రూప్ చాట్‌ను ఆర్కైవ్ చేయడానికి, మీరు దాచాలనుకుంటున్న చాట్‌పై నొక్కి పట్టుకోండి. ఆపై స్క్రీన్ పైన ఉన్న డౌన్ యారో గుర్తుపై క్లిక్ చేయండి.


⦿ అన్ని చాట్‌లను ఆర్కైవ్ చేయడానికి- చాట్స్ ట్యాబ్‌లో, మోర్ ఆప్షన్స్ > సెట్టింగ్స్ నొక్కండి. ఆపై చాట్స్ > చాట్ హిస్టరీ > ఆర్కైవ్ ఆల్ చాట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.


⦿ ఆర్కైవ్డ్ చాట్‌ చూడటానికి చాట్స్ స్క్రీన్ లో టాప్ ఎండ్ కి స్క్రోల్ చేయండి. ఆపై ఆర్కైవ్‌ని నొక్కండి. ఇప్పుడు ఆర్కైవ్‌డ్ చాట్స్ మీకు కనిపిస్తాయి. అక్కడ కొత్తగా వచ్చిన మెసేజెస్ చెక్ చేసుకోవచ్చు.


ఐఫోన్లో చాట్ను అన్ఆర్కైవ్ ఇలా చేసుకోవచ్చు


⦿ ఆర్కైవ్డ్ చాట్‌ల స్క్రీన్‌లో  చాట్‌పై ఎడమవైపుకు స్వైప్ చేయండి. అన్‌ఆర్కైవ్‌ని నొక్కండి.


⦿ మీరు చాట్‌ను మాన్యువల్‌గా అన్‌ఆర్కైవ్ చేయవచ్చు.


⦿ చాట్స్ ట్యాబ్‌లో సెర్చ్ బార్‌ను ట్యాప్ చేయండి.


⦿ చాట్ పేరును టైప్ చేసి ఓకే నొక్కండి. మీకు కావలసిన చాట్‌పై ఎడమవైపుకు స్వైప్ చేయండి. ఆపై అన్‌ఆర్కైవ్‌ చేసుకోవచ్చు.


ఆండ్రాయిడ్ఫోన్ లో  చాట్ను అన్ఆర్కైవ్ ఇలా చేసుకోవచ్చు


⦿ చాట్ లిస్ట్ స్క్రీన్ పైభాగానికి స్క్రోల్ చేయండి.


⦿ ఆర్కైవ్డ్ ఆప్షన్‌పై నొక్కండి.


⦿ మీరు అన్‌ఆర్కైవ్ చేయాలనుకుంటున్న చాట్‌ని నొక్కి పట్టుకోండి.


⦿ స్క్రీన్ పైన అన్‌ఆర్కైవ్‌పై క్లిక్ చేయండి.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!